Diabetes Control With Dal Recipe: భారత్‌లో ప్రస్తుతం డయాబెటిస్ తీవ్ర అనారోగ్య సమస్యగా మారింది. ప్రతి వంద మందిలో 60 నుంచి 65 వరకు డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి.. ఇప్పటికీ ఎలాంటి ఔషధాలు మార్కెట్లోకి రాలేదు. పాటించే ఆహార నియమాల వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల తీవ్ర సమస్యగా రూపాంతరం చెందుతుంది.
కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందుతే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఈ సమస్య ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్న ఆహారాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించిన పలు పప్పు దినుసులను కూడా వినియోగించవచ్చు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలోని చక్కెర నిల్వలను నిలువరించి మధుమేహంపై ప్రభావాన్ని చూపుతాయి.
కందిపప్పుతో కూడా షుగర్ ని నియంత్రించవచ్చు:
చాలామంది క్రమం తప్పకుండా ఇళ్లలో ఆహారంలో భాగంగా కందిపప్పును వినియోగిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన లేదు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పప్పును మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వినియోగిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పప్పులో ఉండే ఐరన్, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం బాడీ పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీ పప్పును వారంలో రెండు లేదా మూడుసార్లు తీసుకోవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమం ఈ పప్పును తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి