సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. మే 26న అంటే రేపు శనివారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. సీబీఎస్ఈ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ లింక్స్ cbseresults.nic.in లేదా cbse.nic.in పై ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది. ఈ ఏడాది నిర్వహించిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షకు 11,86,306 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. భారత్‌లో 4,138 కేంద్రాల్లో, విదేశాల్లో 71 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
CBSE Class 12th results for academic Session 2017-18 to be declared on May 26.
— ANI (@ANI) May 25, 2018
ఈ పరీక్షల ఫలితాల వెల్లడి అనంతరం మరి కొద్ది రోజుల్లోనే సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు సైతం వెల్లడించేందుకు బోర్డ్ ఏర్పాట్లు చేసుకుంటోంది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష కోసం 16,38,420కి పైగా మంది స్టూడెంట్స్ నమోదు చేసుకోగా భారత్‌లో 4,453 కేంద్రాల్లో, విదేశాల్లో 78 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.