Bhai Dooj 2022: భాయ్ దూజ్ పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. సోదరులకు పెట్టే తిలకం ప్రత్యేకత, పూజ విధి..

Bhai Dooj 2022: భాయ్ దూజ్ పండగ హిందువులకు ఎంతో ప్రముఖ్యమైన పండగ. ఈ పండగను దీపావళి జరుపుకున్న తర్వాత జరువుకోవడం విశేషం. అయితే ఈ పండగ ప్రత్యేక, ఏ సమయాల్లో ఈ పండగను జరుపుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 02:37 PM IST
  • భాయ్ దూజ్ పండగను
  • ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
  • సోదరులకు పెట్టే తిలకం ప్రత్యేక, పూజ విధి..
Bhai Dooj 2022: భాయ్ దూజ్ పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. సోదరులకు పెట్టే తిలకం ప్రత్యేకత, పూజ విధి..

Bhai Dooj 2022: హిందువులకు అతి ప్రితికరమైన పండల్లో దీపావళి ఒకటి. భారతలో అన్ని రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగ తర్వాత పలు రాష్ట్రాల్లో భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండగను కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున భారత్‌ వ్యాప్తంగా జరుపుకుంటారు. భాయ్ దూజ్ పండగ ప్రత్యేక విషయానికొస్తే..సోదరీమణులు వారి సోదరులకు తిలకం దిద్ది.. జీవితంలో దీర్ఘాయువు, పురోగతి పొందాలని దేవున్ని ప్రార్థిస్తారు. అంతేకాకుండా సోదరులకు అక్కచెల్లెల్లు బహుమతులు కూడా సమర్పిస్తారు. ఈ పండగ రాఖీ పండగకు విభిన్నంగా ఉంటుంది.

భాయ్ దూజ్ పండుగను చాలా పవిత్రంగా హిందువులు జరుపుకుంటారు. రేపు భాయ్ దూజ్ పండగే కాకుండా గోవర్ధన్ పూజ, అన్నకూట్ పండగలు కూడా ఘనంగా జరుపుకోబుతున్నారు. అయితే ఈ పండగను గ్రహణం కారణంగా జోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన సమయాల్లో మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పండగను ఏ సమయాల్లో జరుపుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భాయ్ దూజ్ 2022 ముహూర్తం:
కార్తీక శుక్ల ద్వితీయ తేది ప్రారంభం: 26 అక్టోబర్ 2022, 02.42 సాయంత్రం
కార్తీక శుక్ల ద్వితీయ తేదీ ముగిసే సమయం: 27 అక్టోబర్ 2022, మధ్యాహ్నం 12.45

భాయి దూజ్ పూజ ముహూర్త:
సాయంత్రం: 01:18 నుంచి 03:33(26 అక్టోబర్ 2022)
విజయ ముహూర్తం: సాయంత్రం 02:03 నుంచి 02:48 వరకు
సంధ్య ముహూర్తం: సాయంత్రం 05:49 నుంచి 06:14

భాయి దూజ్ పూజ విధి:
భాయ్ దూజ్ పండగ రోజున యమునా నదిలో స్నానానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక వేళా మీకు యమున నది తీరం అందుబాటులో లేకపోతే.. సూర్యోదయానికి ముందు స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అయితే ఇలా చేసిన తర్వాత సోదరీమణులు తమ సోదరుల కోసం వివిధ రకాల వంటకాలను సిద్ధం చేయాలి. ఆ తర్వాత పూజా కార్యక్రమం కోసం పూజ ప్లేట్ సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత సోదరుడిని ఒక స్టూల్‌ పై కూర్చో పెట్టి.. ఆపై కుంకుంతో అక్షతతో తిలకం దిద్దండి. ఈ క్రమంలో సోదరునికి జీవితం మొత్తం మంచి జరగాలని గంగా ఆరాధన, యమునా ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించాల్సి ఉంటుంది.

తిలకం ప్రాముఖ్యత:
ఈ తిలకం విజయం, శక్తి, గౌరవానికి చిహ్నంగా జోతిష్య శాస్త్రం పరిగణించింది. అక్కచెల్లెలు ఈ తిలకాన్ని సోదరులకు దిద్దడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే సోదరులు ఈ రోజున అక్కచెల్లెలకు భోజనం పెడితే అపశ్రుతులు, అపకీర్తి, శత్రు, భయం మొదలైన బాధలు దూరమవుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వారిపై చెడు ప్రభావవం కూడా సులభంగా పోతుంది.

Also Read : Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు

Also Read : Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్‌.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News