Harish Shankar-Hello Meera : హలో మీరా కోసం హరీష్‌ శంకర్.. ఆ విషయం తెలిసిపోతోందన్న డైరెక్టర్

Harish Shankar For Hello Meera హరీష్‌ శంకర్ తాజాగా ఓ చిన్న సినిమా హలో మీరా కోసం ముందుకు వచ్చాడు. హలో టీజర్ మూవీని రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 08:05 PM IST
  • చిన్న సినిమా కోసం స్టార్ డైరెక్టర్
  • హలో మీరా టీజర్ రిలీజ్ చేసిన హరీష్‌ శంకర్
  • హీరోయిన్ గార్గేయి కొత్త సినిమా సందడి
Harish Shankar-Hello Meera : హలో మీరా కోసం హరీష్‌ శంకర్.. ఆ విషయం తెలిసిపోతోందన్న డైరెక్టర్

Hello Meera Teaser : ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోయిన్‌గా గార్గేయ్ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ చాలా గ్యాప్ తరువాత హలో మీరా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమూవీ టీజర్‌ను నేడు రిలీజ్ చేశారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.  బాపు గారి శిష్యుడు కాకర్ల శ్రీనివాసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డా లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా.. అందుకే తిరిగి హైద్రాబాద్‌కు వెళ్తున్నా అని మీరా పాత్రలో ఉన్న హీరోయిన్ గార్గేయి చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. ఆ తరువాత కళ్యాణ్ అనే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ.. ఐ లవ్యూ బేబీ అని మీరా అంటే.. నో అని అవతలి వ్యక్తి అంటాడు. ఐ లవ్యూ మోర్ అని అనడంతో మీరా నవ్వేస్తుంది. అయితే ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది.

 

ఇన్ స్టాగ్రాంలో పాత స్నేహితుడు చేసిన పని మీరాకు చుట్టుకుంటుంది. చివరకు అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. ఇలా విజయవాడ నుంచి మీరా హైద్రాబాద్‌ వెళ్లే సమయంలోనే కొన్ని వేల కాల్స్ వస్తుంటాయి. హలో మీరా అంటూ అందరూ ఫోన్లుచేస్తుంటారు. దీంతో మీరాకు చిర్రెత్తుకొస్తుంది. అసలు మీరా లైఫ్‌లో ఏం జరిగింది? పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్ స్టాగ్రాంలో ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలను ఈ టీజర్ అందరి మైండ్లోనూ క్రియేట్ చేసింది.

టీజర్ రిలీజ్ చేసిన హరీష్‌ శంకర్.. ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉండబోతోందనే విషయం తెలుస్తోందంటూ హరీష్‌ శంకర్ కితాబిచ్చేశాడు. సింగల్ క్యారెక్టర్‌తో సినిమాను రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి హలో మీరాను దర్శకుడు ఎలా తీర్చిదిద్దాడో చూడాలి. 

Also Read : Bigg Boss Sreemukhi Photoshoot : ప్యాంట్ మరిచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలతో హీట్ పెంచేస్తోన్న శ్రీముఖి

Also Read : Hamida Khatoon New Benz Car : కొత్త కారు కొన్న హమీద.. దాని రేటు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x