Anasuya Bharadwaj Food : నేను బాగా తింటున్నా.. కొవ్వు పెరుగుతోంది కానీ.. అనసూయ కామెంట్స్ వైరల్

Anasuya Bharadwaj About Her Daily Workouts బుల్లితెరపై అనసూయ చేసే హంగామా, జిమ్‌లో తన భర్తతో కలిసి చేసే వర్కౌట్లు మామూలుగా ఉండవు. నిత్యం వర్కవుట్లు చేస్తూనే ఉంటుంది అనసూయ.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 08:58 AM IST
  • నెట్టింట్లో అనసూయ సందడి
  • బాగా తింటున్నానంటోన్న యాంకర్
  • జిమ్‌లో చెమటోడుస్తున్న అనసూయ
Anasuya Bharadwaj Food : నేను బాగా తింటున్నా.. కొవ్వు పెరుగుతోంది కానీ.. అనసూయ కామెంట్స్ వైరల్

Anasuya Bharadwaj Food : బుల్లితెరపై, వెండితెరపై అనసూయకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అయితే అనసూయ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంది. జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందో సరైన కారణం అయితే చెప్పలేదు. ఎంతో ఆలోచించి వచ్చానని చెప్పుకొచ్చింది. ఈటీవీ నుంచి బయటకు వచ్చిన అనసూయ.. స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్టుగా వెళ్లింది. అలా అనసూయకు ఇప్పుడు ఆ షో కూడా లేకుండా పోయింది.

దీంతో అనసూయకు ప్రస్తుతం బుల్లితెరపై ఎలాంటి ఆఫర్లు లేవు. ఆమె తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టేసింది. ఇప్పుడు అనసూయ చేతి నిండా ప్రాజెక్టులున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు కూడా ఎంచుకుంటోంది. అయితే ఈ చిత్రాలేవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటం లేదు. అనసూయకు హిట్ వచ్చి కూడా చాలా కాలమే అవుతోంది. పుష్ప మొదటి పార్టులో అనసూయ పాత్రకు,గెటప్‌కు కూడా నెగెటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అనసూయ ఇప్పుడు కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం అందరికీ తెలిసిందే.తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే కేసు వేస్తాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది. మొన్నటి వరకు అనసూయ.. ఫారిన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేసింది. ఇప్పుడు అనసూయ తన ఫేస్ బుక్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది.

అందులో ఇలా చెప్పుకొచ్చింది. నేను ఈ మధ్య బాగా తింటున్నా.. బాగా కొవ్వెక్కేస్తోంది.. కానీ అదంతా ఎక్కడికి పోతోంది?.. ఇలా చెమట రూపంలో బయటకు వెళ్తోంది అంటూ తన వర్కౌట్ సెషన్ గురించి అనసూయ చెప్పింది. చూస్తుంటే అనసూయ భాగానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేసి తెగ చెమటను కార్చేస్తోంది.

అనసూయ చివరగా దర్జా అనే సినిమాతో పలకరించింది. అది దారుణంగా బెడిసి కొట్టేసింది. ఆ తరువాత వాంటెడ్ పండుగాడ్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పుష్ప పార్ట్ 2 కోసం రెడీగా ఉంది. అనసూయ ఆల్రెడీ మలయాళంలో మమ్ముట్టి భీష్మ పర్వం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : Swara Bhaskar Trolls : నీకు ఇంతకంటే పెద్దది కావాలా?.. స్వర భాస్కర్ కౌంటర్ వైరల్

Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News