Fig Benefits For Diabetes: డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇందులో శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి వీటిని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం పొందే మూలకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే అంజీర్ శరీరానికి ఎక్కువగా మేలు చేస్తుంది. ఇందులో ఊబకాయం, మలబద్ధకాన్ని నివారించే గుణాలున్నాయి. వీటిని పాలలో నానబెట్టి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అయితే ఇతర అనారోగ్య సమస్యలకు ఈ అంజీర్ ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అంజీర్ ప్రయోజనాలు:
1. అంజీర్‌లో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని పాలలో నానబెట్టి ఉదయం పూట అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. దంతాల సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపం సమస్యతో బాధపడేవారు వీటిని ప్రతి రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. గుండె జబ్బుల సమస్యలతో బాధపడేవారికి అంజీర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్నితగ్గించడానికి కీలక పాత్రపోషిస్తుంది. అయితే గుండె పోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలలో ఈ డ్రై ఫ్రూట్స్‌ను తీసుకుంటే సులభంగా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది పొట్టలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎలాంటి ప్రోడక్ట్ వినియోగించకుండా కేవలం ఆరోగ్యంగా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆయితే ఆహారంలో అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.
4. అంజీర్ పండ్లలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రింస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె పోటు నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా బీపీ కూడా అదుపులో ఉంటుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook