Virat Kohli Record: మరో 28 పరుగులే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న విరాట్ కోహ్లీ!

Virat Kohli need 28 runs to breaks Mahela Jayawardene T20 World Cup record. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 30, 2022, 01:12 PM IST
  • దక్షిణాఫ్రికాతో భారత్ బిగ్ ఫైట్
  • మరో 28 పరుగులే
  • ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న కోహ్లీ
Virat Kohli Record: మరో 28 పరుగులే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న విరాట్ కోహ్లీ!

IND vs SA, Virat Kohli eye on Mahela Jayawardene T20 World Cup record: ఆసియాకప్ 2022 వరకు ఫామ్‌ లేమితో సతమతమైన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దుమురేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ (82 నాటౌట్‌) ఆడిన కోహ్లీ.. నెదర్లాండ్స్‌పై (62 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు మ్యాచ్‌లలో కోహ్లీ 144 పరుగులు బాదాడు. నేడు దక్షిణాఫ్రికాపై చెలరేగాలని ఫాన్స్ సహా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కోహ్లీ ఫామ్ చూస్తే.. మరో హాఫ్ సెంచరీ చేయడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌కు ముందు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రొటీస్ మ్యాచ్‌లో విరాట్ 28 పరుగలు చేస్తే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేళ జయవర్ధనే పేరుపై ఉంది. టీ20 ప్రపంచకప్‌లో జయవర్ధనే 1016 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 23 టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 989 పరుగులు చేశాడు. ఇప్పటికే భీకర ఫామ్‌లో ఉన్న కోహీ.. నేడు దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్‌లో మరో 11 పరుగులు చేస్తే టీ20 ప్రపంచకప్‌లో 1000 రన్స్‌ పూర్తిచేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలువనున్నాడు. 

మహేళ జయవర్దనే 31 మ్యాచుల్లో 1016 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 23 మ్యాచుల్లోనే 989 పరుగులు బాదాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులుచేసిన జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. గేల్ 33 మ్యాచుల్లో 965 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 35 మ్యాచ్ ల్లో 904 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఈ రికార్డు అందుకోవాలంటే భారీ సెంచరీ చేయాల్సి ఉంది. 

Also Read: IND vs SA Dream11 Team: దక్షిణాఫ్రికాతో భారత్ బిగ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!

Also Read: Jabardasth Varsha Latest Photos: బంగారు వర్ణపు డ్రెస్సులో జిగేల్ మనిపిస్తున్న వర్ష..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News