Bigg Boss Elimination : బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఇద్దరు కంటెస్టెంట్లు అవుట్

Bigg Boss 6 Telugu 10th Week Elimination బిగ్ బాస్ ఇంట్లో పదోవారం ఎలిమినేషన్స్‌లో అందరికీ షాకుల మీద షాకులు వచ్చేట్టు కనిపిస్తోంది. బాలాదిత్య మెరినా ఇద్దరూ ఎలిమినేట్ అయినట్టు లీకులు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 02:40 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పదోవారం ఎలిమినేషన్లు
  • బాలాదిత్య, మెరినా ఎలిమినేషన్ లీకులు
  • నెట్టింట్లో బాలాదిత్య అభిమానుల రచ్చ
Bigg Boss Elimination : బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఇద్దరు కంటెస్టెంట్లు అవుట్

Bigg Boss 6 Telugu 10th Week Elimination : బిగ్ బాస్ ఇంట్లో పదో వారం నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ల మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు లీకులు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఈ పదోవారం నుంచి ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారని, ఆ ఇద్దరు ఎవరో కాదు.. బాలాదిత్య, మెరినా అనే టాక్ ఎక్కువగా వస్తోంది. బాలాదిత్య, మెరినా ఎలిమినేట్ అయ్యారంటూ ట్వీట్లు, పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక దీంతో అందరూ బాలాదిత్య ఎలిమినేషన్ విషయంలో షాక్ అవుతున్నారు.

మెరినా ఎందుకు ఎలిమినేట్ అయింది అనే విషయంలో ఎవ్వరికీ ఏ అనుమానం ఉండదు.ఎందుకంటే ఆమె ఎలిమినేట్ అవుతుందని, జనాలు కూడా ఆమెను ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. అలానే చేశారు. రోహిత్, మెరినాలోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఆడియెన్స్ అనుకుంటూనే ఉన్నారు.అన్నట్టుగానే మెరినాను బయటకు పంపించేశారు.

కానీ బాలాదిత్య లాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేసేంతగా ఏం జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. బాలాదిత్య ఎలిమినేషన్‌కు గల కారణాలు మాత్రం అంతగా తెలియడం లేదు. మంచిగా ఉండటం, ఎవ్వరినీ మోసం చేయకుండా ఆడటం, ప్రేమగా మాట్లాడటం, గొప్పలు చెప్పుకోలేకపోవడం, ఎదుటి వాళ్లను కించపరుస్తూ పిచ్చి వేషాలు వేస్తూ కంటెంట్ ఇవ్వలేకపోవడం, టీఆర్పీ మెటీరియల్ కాకపోవడంతోనే బాలాదిత్యను ఎలిమినేట్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో బాలాదిత్య అభిమానులు అనుకుంటున్నారు.

అయితే ఈ బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది ఆడియెన్స్ చేతిలో ఉంటుందని అంతా అంటారు. కానీ ఒక్కోసారి మాత్రం ఆ నిర్ణయాన్ని బిగ్ బాస్ టీం తీసుకుంటుందని అంటారు. అలా అయితే టీఆర్పీ కంటెంట్ ఇచ్చే గీతూని కూడా ఎలిమినేట్ చేయకూడదు. కానీ గత వారం గీతూ ఎలిమినేషన్ ఈ వారం బాలాదిత్య ఎలిమినేషన్ రెండూ షాకింగ్‌గానే అనిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ అంటే మామూలుగా ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం.

Also Read : Jambalakidi jaaru Mitaya : జంబలకిడి జారు మిఠాయా.. నవ్వులు పూయించిన అషూ.. వీడియో వైరల్

Also Read : Pooja RamaChandran Pregnant: తల్లి కాబోతున్న పూజా రామచంద్రన్.. భర్తతో లిప్ లాక్స్ పెట్టుకుంటూ అనౌన్స్ చేసిందిగా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News