బిగ్‌బాస్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా..ఏం మాట్లాడినా..ఏం చేసినా ఆ హౌస్‌లో బిగ్‌బాస్ కళ్లు వెంటాడుతుంటాయి. ఇప్పుడా కళ్లు బిగ్‌బాస్ హౌస్ దాటి మెట్రోలో కూడా వెంటాడనున్నాయి. నిజమే..అబద్ధం కాదు..ఆ వివరాలు మీ కోసం..
హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ చేపట్టిన వినూత్న కార్యక్రమం ఫలితమిది. బిగ్‌బాస్‌తో ఎల్ అండ్ టీ చేతులు కలిపింది. బిగ్‌బాస్ కళ్లు ఇక నుంచి మెట్రోలో కూడా వెంటాడేలా ఒప్పందమైంది. ప్రయాణీకులకు అవగాహన కల్పించేందుకు ఎల్ అండ్ టీ టీమ్ బిగ్‌బాస్‌ను రంగంలో దింపింది. సురక్షిత ప్రయాణంపై సామాజిక సందేశాన్ని అందించేలా..స్టార్ మా, ఎల్ అండ్ టి మెట్రో సంయుక్తంగా ప్రచారానికి దిగాయి. అందుకే బిగ్‌బాస్‌ను రంగంలో దింపి..బిగ్‌బాస్ వాచింగ్ యు అనే కాషన్ ఇస్తున్నారు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను బిగ్‌బాస్ సీజన్ 6 హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ఆవిష్కరించారు. మెట్రో రైళ్లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే బిగ్‌బాస్ వాచింగ్ యు కార్యక్రమం ఉద్దేశ్యంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్లలో ఉన్న కాన్‌కోర్స్ ఎంట్రీ, ఎగ్జిట్, చెక్‌ఇన్ ప్రాంగణాల్లో చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా జింగిల్స్ సందేశాలు ప్రచారం కానున్నాయి. అటు బిగ్‌బాస్ హౌస్‌లో కూడా ఇదే ప్రచారం జరగనుంది. ప్రయాణ సమయంలో ఎలా ఉండాలి, స్టేషన్ ప్రాంగణాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఈ కార్యక్రమం ఉంటుంది.
వినోదంతో పాటు మంచి సందేశాన్నిచ్చే ప్రచార కార్యక్రమమని బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున తెలిపారు. బిగ్‌బాస్ ఓ వినోదాత్మక కార్యక్రమమమని..దీనిద్వారా భద్రతపై మరింత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ప్రయాణీకులకు చక్కని విలువల్ని అందిస్తుందన్నారు.
Also read: Koratala shiva NTR Movie: ఎన్టీఆర్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ సిద్ధం చేసిన కొరటాల శివ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook