Rohit Reddy On Ed Enquiry: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు .. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను భగ్నం చేశానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్దారు. ఈడీ, సీబీఐ, ఐటీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేసు వివరాలు చెప్పకుండా ఈడీ తనను బయోడేటా ఇవ్వమందని.. మొదటిరోజు 6 గంటలు కూర్చోబెట్టి కేసు వివరాలు చెప్పలేదన్నారు. రెండోరోజు విచారణలో కేసు వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తే.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అని చెప్పారని తెలిపారు.
'కేసుతో సంబంధం లేకున్నా అభిషేక్‌ను విచారణకు పిలిచారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో మనీ లాండరింగ్ జరగలేదు. నన్ను లోబరుచుకోవాలనే ఈడీ నోటీసులు అని నేను అనుకుంటున్నా. ఫిర్యాదుదారునిగా ఉన్న నాపై ఈడీ విచారణ జరపడం విడ్డురంగా ఉంది. నందకుమార్‌ను విచారణ జరుపుతామని కోర్టులో అప్పీల్ చేసుకున్నారు ఈడీ అధికారులు. నందకుమార్ స్టేట్మెంట్ ద్వారా నన్ను కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. నందకుమార్‌ను వాడుకొని నన్ను ఇరికిస్తున్నట్లు నాకు సమాచారం ఉంది. నన్ను ఎట్లాగైనా దోషిగా చూపించే దిశగా కేసును తీసుకెళ్తున్నారు..' అని రోహిత్ రెడ్డి అన్నారు.
తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను లొంగనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో హై స్పీడ్‌లో వెళ్తున్న బీజేపీకి తాను బ్రేక్ వేశానని చెప్పారు. తనను అరెస్ట్ చేసినా.. బీజేపీకి లొంగనని తేల్చి చెప్పేశారు. తనకు న్యాయవ్యస్థపై నమ్మకం ఉందని.. రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నట్లు తెలిపారు. మరోసారి బీజేపీ కుట్రను భగ్నం చేస్తానని.. ఇది బీఆర్ఎస్ సమస్య కాదు.. తెలంగాణ ప్రజల సమస్య అని అన్నారు. కేసుతో సంబంధం లేని తనను ఎందుకు విచారణ చేస్తున్నారని కోర్టుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నందకుమార్‌తో పాటు వాళ్లను విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన తనను ఎందుకు విచారణ చేయడంపై కోర్టులో కేసు వేస్తానని అన్నారు. ఈ నెల 27న ఈడీ విచారణకు మరోసారి హాజరవుతున్నట్లు వెల్లడించారు.
Also Read: Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్
Also Read: Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook