Rahu Planet Transit 2022: తిరోగమన రాహువు సంచారం.. ఈ 3 రాశుల ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..

Rahu Planet Transit 2022: త్వరలో రాహు గ్రహం మేషరాశిలో సంచరించబోతుంది. అప్పటి వరకు రాహు సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 10:41 AM IST
Rahu Planet Transit 2022: తిరోగమన రాహువు సంచారం.. ఈ 3 రాశుల ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..

Rahu Planet Transit 2022: వేద జ్యోతిషశాస్త్రంలో రాహు గ్రహాన్ని అంతుచిక్కని గ్రహంగా భావిస్తారు. రాహువు ఎల్లప్పుడూ తిరోగమన దిశలోనే కదులుతాడు. రాహు గ్రహం అక్టోబర్ 30న మేషరాశిలో సంచరించనున్నాడు. ఈ రాహు గోచారం వల్ల మూడు రాశులవారు అపారమైన డబ్బుతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు.  ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశిచక్రం (Scorpio): రాహు గ్రహం మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో సంచరిస్తోంది. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. పాటు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే కోరిక నెరవేరుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. 

కర్కాటక రాశిచక్రం (Cancer): రాహు గ్రహం మీ రాశి నుండి పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది మీకు భవిష్యత్తులో లాభాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 

కన్య రాశిచక్రం (Virgo): రాహువు యొక్క తిరోగమన చలనం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రాహు గ్రహం మీ సంచార జాతకంలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తోంది. ఈ సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. రీసెర్చ్ చేసేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారు మీరు పదవిని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 

Also Read: Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత సొంతరాశిలోకి శనిదేవుడు...ఈ 3 రాశులకు కష్టాలే కష్టాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U   

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News