Liver Disease Symptoms: మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడంలోనూ, రక్తాని ఫిల్టర్ చేయడంలోనూ లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ కాకుండా చూస్తుంది. బాడీలోని విషపదార్థాలను తొలగించడంలో సాయపడుతుంది. ఇది ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. అందుకే కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన లివర్ వ్యాధి గురయితే మన శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని మీరు సకాలంలో గుర్తించడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా అరికట్టవచ్చు.
కాలేయ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
చర్మం పసుపు రంగులోకి మారడం
కాలేయంలో ఎలాంటి సమస్య వచ్చినా దాని ప్రభావం నేరుగా మీ చర్మంపై కనిపిస్తుంది. కామెర్లు వచ్చినప్పుడు మన స్కిన్ మరియు గోళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుంది. అలాంటప్పుడే మీరు డాక్టర్ వద్దకు వెళ్లి బిలిరుబిన్ పరీక్ష చేయించుకోవాలి.
దురద రావడం
కాలేయం బలహీనంగా లేదా పాడైపోయినప్పుడల్లా... చర్మంపై దురద పుడుతుంది. దురద అనే రకాలుగా రావచ్చు. అయితే ఇలా రావడం కూడా లివర్ వ్యాధికి సంకేతం.
స్కిన్ పై నీలిరంగు మచ్చలు
చాలా సార్లు శరీరంపై నీలి రంగు దద్దుర్లు కనిపిస్తాయి. దీని వల్ల రక్తస్రావం జరుగుతుంది. ఇది కాలేయ సమస్యకు పెద్ద సంకేతం.
చర్మంపై స్పైడర్ ఆంజియోమా ఏర్పడటం
స్పైడర్ ఆంజియోమా అనేది చర్మం యొక్క దిగువ భాగంలో సంభవించే వ్యాధి. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరగడం వల్ల చర్మం ఆకృతి స్పైడర్ వెబ్‌ల వలె కనిపిస్తుంది. మీకు ఇలా అనిపిస్తే కాలేయంలో ఏదో ఒక రకమైన సమస్య వచ్చిందని అర్థం చేసుకోండి.
Also Read: Kidney Health: మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి, లేకపోతే మీ కిడ్నీలకు దెబ్బే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe