Guru Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న గురుడు... వీరికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..

Jupiter Transit 2023: న్యూ ఇయర్ లో గురు గ్రహం తన రాశిని మార్చనుంది. దీని కారణంగా అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2023, 03:23 PM IST
Guru Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న గురుడు... వీరికి డబ్బుతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..

Guru Rashi Parivartan 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో సంచరించడం లేదా తిరోగమనం చెందడం చేస్తాయి. ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఫిబ్రవరి 1 దేవగురు బృహస్పతి యవ్వనంలోకి ప్రవేశించబోతున్నాడు. గురుడు యెుక్క ఈ మార్పు కారణంగా అరుదైన హన్స్ పంచ రాజయోగం (Hans Panch Raj Yoga) ఏర్పడనుంది. ఈ సమయంలో ఏ రాశులవారికి ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి (Sagittarius): ఈరాశి యెుక్క ఐదో ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది. మీరు ఏదైనా కోర్సులో చేరడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం ఫలించే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 

సింహరాశి (Leo): గురుడి యెుక్క రాశి మార్పు వల్ల హన్స్ పంచ రాజయోగం ఏర్పడతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఆర్థికంగా మీరు పురోగమిస్తారు. ఫ్యామిలీతో మీ బంధం గట్టిపడుతుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

మకరరాశి (capricorn): బృహస్పతి స్థానం మారడం వల్ల హన్స్ పంచ మహాపురుష యోగం ఏర్పడుతుంది. దీంతో మీరు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ రాజయోగం మకరరాశి యెుక్క నాల్గో ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ సుఖాలు పెరుగుతాయి. ఏదైనా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసే వారు లాభపడతారు. 

Also read: Venus Gochar 2023: కుంభరాశిలో శుక్ర గోచారం.. త్వరలో వీరికి గోల్డెన్ డేస్ మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News