Dates Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు ఖర్జూరం ఎక్కువగా తినకూడదట..తింటే అంతే సంగతి.!

Side Effects Of Eating Dates: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని ఎక్కువ తీసుకుంటే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీని వల్ల కలిగే దుష్ర్పయోజనాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 09:53 AM IST
Dates Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు ఖర్జూరం ఎక్కువగా తినకూడదట..తింటే అంతే సంగతి.!

Side Effects Of Eating Dates: ఖర్జూరం చాలా పోషకాలున్న పండు. దీనిని రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులతో పోరాడి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ఇందులో కేలరీలు, ఫైబర్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మరియు కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్య సమస్య ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే కొందరు ఈ ఖర్జూరాన్ని అతిగా తింటారు. దీని వల్ల వారు కొన్ని దుష్ర్పభావాలు ఎదుర్కోంటారు. ఖర్జూరం ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి. 

1. హైపోగ్లైసీమియా
టైప్-2 మధుమేహం ఉన్న రోగులు ఖర్జూరం తినడం వల్ల మేలు జరుగుతుంది. అయితే దీనిని అధికంగా తీసుకుంటే మీరు హైపోగ్లైసీమియా బారిన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరంలో మీ చక్కెరస్థాయిలు పడిపోతాయి. దీని వల్ల మీ బాడీలో బలహీనతతోపాటు మైకం రావచ్చు. 
2. ఊబకాయం
ఖర్జూరాల్లో చాలా కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు దీనిని తింటే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు ఇంకా వైట్ పెరిగే అవకాశం ఉంది. 
3. అలెర్జీ
ఖర్జూరాలను ఎక్కువగా తినడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఈ పండులో సల్ఫైడ్లు ఉంటాయి. ఇది అలెర్జీలకు కారణమవుతుంది. దీంతో మీ కళ్లలో దురద, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Weight Loss Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారట..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News