Premature White Hair Problem Solution: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే తెల్లజుట్టు తెల్ల జుట్టు సమస్యలు రావడం సర్వసాధరణమైనది. నాడు 40 ఏళ్లు దాటితే తెల్లజుట్టు వచ్చేది. కానీ ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల 20 ఏళ్లకే తెల్లజుట్టు వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 30 ఏళ్లు వచ్చేసరికి చాలా మంది యువతలో గడ్డం కూడా తెల్లగా మారుతుంది. వయస్సుకు ముందు వృద్ధాప్యంగా కనిపించకుండా ఉండటానికి చాలా మంది మార్కెట్‌లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఎలాంటి ఖర్చులు లేకుండా ఇలా సులభంగా తెల్లజుట్టును నల్లగా చేసుకొవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తెల్ల జుట్టు ఇలా సులభంగా నల్లగా మారడం ఖాయం:
ఉసిరి:
ఉసిరి జుట్టును బలంగా, నల్లగా చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఉసిరికాయ క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అంతేకాకుండా గోరింటకు పొడిలో ఉసిరి పొడిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
మెంతులు:
మెంతులు శరీరానికే కాకుండా జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలను చేకూర్చుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టును నల్లగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మెంతులను నీటిలో నానబెట్టి మిశ్రమంలా తయారు చేసి బాదం నూనెలో కలిపి జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
సహజమైన వస్తువులు:
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ప్రతి రోజూ హెన్నా, ఉసిరి, కాఫీ వంటి కొన్ని సహజమైన వస్తువులను వినియోగించాల్సి ఉంటుంది. వీటిల్లో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టును తక్కువ కాల వ్యవధిలోనే నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది. కాబట్టి తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాటిని వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook