Bank Loan Fraud: తస్మాత్ జాగ్రత్త, మీ పేరుపై మీకు తెలియకుండా ఎవరైనా లోన్ తీసుకున్నారా, ఇలా చెక్ చేసుకోండి

Bank Loan Fraud: సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. జనాల డబ్బుల్ని దోచేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఒకటి లోన్ మోసాలు. కరోనా మహమ్మారి సమయంలో ఈ మోసాలు బాగా పెరిగిపోయాయి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2023, 05:44 PM IST
Bank Loan Fraud: తస్మాత్ జాగ్రత్త, మీ పేరుపై మీకు తెలియకుండా ఎవరైనా లోన్ తీసుకున్నారా, ఇలా చెక్ చేసుకోండి

మీ పేరుపై మీ ప్రమేయం లేకుండా ఎవరైనా లోన్ తీసుకుని ఉన్నారా..వినడానికి విచిత్రంగా ఉన్నా అవకాశముంది దీనికి. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా వరకూ వెలుగుచూస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ పూర్తి వివరాలు మీ కోసం..

సైబర్ నేరగాళ్లు పాన్ కార్డు సహాయంతో రుణాలు తీసుకుంటారు. సంబంధిత పాన్ కార్డు హోల్డర్లకు ఈ విషయం ఆలస్యంగా తెలుస్తుంది. ఇప్పుడంతా ఇంటర్నెట్ సౌకర్యం కావడంతో మోసాలు జరగడం సాదారణమైపోయింది. ప్రజలు కష్టపడి జీవితాంతం సంపాదించించి దోచేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతులు అవలంభిస్తుంటారు. ఇందులో ఒకటి లోన్ ఫ్రాడ్. అయితే ఇదేమీ కొత్త కాదు. చాలాకాలంగా ఉన్నదే. కానీ కరోనా మహమ్మారి సమయంలో ఈ కేసులు బాగా పెరిగిపోయాయి.

సైబర్ నేరగాళ్లు

వివిధ వ్యక్తుల పేరిట సైబర్ నేరగాళ్లు రుణాలు తీసుకుంటుంటారు. ఈ విషయం ఆ వ్యక్తులకు కనీసం సమాచారం కూడా ఉండదు. సంబంధిత వ్యక్తులకు తెలిసేలోగా పరిస్థితి చేజారిపోతుంది. ఆ వ్యక్తి పేరిట రుణం, వడ్డీ పెరిగిపోతుంది. మీకు తెలియకుండా మీ పేరుతో మరొ వ్యక్తి లోన్ ఎలా తీసుకోవచ్చనే సందేహం రావచ్చు. ఇక రెండవది ఇలా ఎవరైనా తీసుకున్నారో లేదో ఎలా తెలుస్తుంది. మూడవది ఈ ఫ్రాడ్ నుంచి ఎలా కాపాడుకోవాలి.

సైబర్ నేరగాళ్లు మొబైల్, పాన్ కార్డు ద్వారా ఈ మోసాలకు పాల్పడుతుంటారు. చిన్న చిన్న రుణాల్ని బయటి వ్యక్తుల పేరిట తీసుకుంటారు. దీనికోసం వెరిఫికేషన్ సమస్య తలెత్తదు. ఎందుకంటే గత కొద్దికాలంగా ఇన్‌స్టంట్ లోన్స్ సౌకర్యం బాగా పెరిగింది. సైబర్ నేరగాళ్లు ఈ ప్రయోజనం పొందుతున్నారు.

వివిధ అవసరాల రీత్యా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును ఇతరులతో షేర్ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్ ఎక్కౌంట్‌తో పాన్ కార్డు అనుసంధానమై ఉంటుంది. బ్యాంకు ద్వారా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు ఏజెన్సీల సహాయం తీసుకోవచ్చు. దీనిద్వారా మీ పేరిట ఎంత రుణం ఉందో తెలుసుకోవచ్చు. ఏదైనా నకిలీ రుణం మీ పేరుపై ఉంటే..సిబిల్ హిస్టరీలో తెలిసిపోతుంది. 

అప్రమత్తత అన్నింటికీ మంచిది. క్రెడిట్ స్కోరులో ఏదైనా సమస్య తలెత్తితే క్రెడిట్ ఇచ్చే క్రెడిట్ బ్యూరోను సంప్రదించాలి. జరిగిన మోసం గురించి వివరాలు అందించాలి. అందుకే తెలియని వ్యక్తులతో మీ వ్యక్తిగత డాక్యుమెంట్లు షేర్ చేసుకోకూడదు. ఒకవేళ బయటి వ్యక్తులకు ఇవ్వాల్సి వస్తే..ఎందుకిస్తున్నారనేది ఆ డాక్యుమెంట్లపై రాస్తే బాగుంటుంది. 

Also read: Rs. 240 Cr Penthouse: రూ. 240 కోట్ల పెంట్‌హౌజ్.. కొన్నది ఎవరో కాదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News