Nagababu Satires On Minister Roja: ఏపీ మంత్రి రోజాపై జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా రోజాకు కౌంటర్ ఇచ్చారు. నిండ్ర మండలం బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన రూ.11 లక్షల నిధులతో మంజూరు చేసిన తాగునీటి బోరు, పైపులైన్లకు మంత్రి రోజా పూజ చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఆత్మసంతృప్తి కల్గించిందంటూ మంత్రి అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నిండ్ర మండలంలో #గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన 11 లక్షల నిధులతో మంజూరు చేసిన త్రాగునీటి బోరు మరియు పైపులైన్లకు ఈరొజు పూజ చేసి ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించింది. #YSJaganAgain #YSJaganMarkGovernance pic.twitter.com/13i2FtZT3x
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 7, 2023
ఈ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. 'హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా!. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం.' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను జనసైనికులు తెగ షేర్ చేస్తున్నారు. మంత్రి రోజాను టార్గెట్‌గా చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం. pic.twitter.com/PXcD9tIurA
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 11, 2023
మంత్రి ప్రారంభించిన చిన్న కార్యక్రమానికి 11 లక్షల రూపాయలు ఖర్చ అయిందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ ట్యాంక్‌కు రూ.500.. కింద కట్టిన సిమెంట్ దిమ్మెకి అన్ని ఖర్చులు వేసినా రూ.10 వేలు కూడా అవ్వదంటున్నారు. 'వైఎస్ఆర్ పోలవరం'ను మంత్రి రోజా ప్రారంభించారంటూ సెటైర్లు పేలుస్తున్నారు. గతంలో నాగబాబు, మంత్రి రోజా జబర్దస్త్ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. నాగబాబు వేరే ఛానల్‌కు వెళ్లి.. ఆ తరువాత పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. మంత్రి పదవి వచ్చిన తరువాత జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు రోజా. ఇటీవల చిరంజీవిపై మంత్రి రోజా కామెంట్స్ చేయగా.. నాగబాబు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..
Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook