Hyderabad Fire Accident: హైదరాబాద్ పురానాపూల్‌లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు సమచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో గోదాం పైకప్పు కూలింది. ఈ గోదాంలో ఫ్లాస్టిక్, కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు.
ఇప్పటికే పరిసర ప్రాంత ప్రజలను ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించారు. పైకప్పు కూలడంతో మంటలను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఘటనాస్థలిలో మూడు అంబులెన్స్ లు రెడీగా ఉంచున్నట్లు తెలుస్తోంది. గోడౌన్ లో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలియరావల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది.
తాజా ఘటనతో రాష్ట్రంలో నిబంధనలు పాటించని గోదాంలు, భవనాలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపుందుకుంది. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెున్న సికింద్రాబాద్ ఘటన.. నేడు ఈ ప్రమాదం జరగడంతో తెలంగాణ అగ్నిమాపక విపత్తు నివారణశాఖ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Also Read: Godavari Express Derailed: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్, తప్పిన పెను ప్రమాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook