Richi Gadi Pelli Trailer : రిచి గాడి పెళ్లి కోసం హరీష్‌ శంకర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Richi Gadi Pelli Trailer రిచి గాడి పెళ్లి ట్రైలర్ చూస్తుంటే కాన్సెప్ట్ ఏంటో అర్థం అయింది. పెళ్లి అంటూ ఇచ్చిన బ్యాచిలర్‌ పార్టీలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ చాలెంజ్‌ను తీసుకోవడంతో కథ అంతా మలుపులు తిరిగేలా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 06:40 PM IST
  • చిన్న సినిమా కోసం హరీష్‌ శంకర్
  • ఆసక్తికరంగా మారిన రిచి గాడి పెళ్లి
  • ట్రైలర్‌లోనే కథ చెప్పేశారుగా!
Richi Gadi Pelli Trailer : రిచి గాడి పెళ్లి కోసం హరీష్‌ శంకర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Richi Gadi Pelli Trailer కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఇప్పుడు ఆదరణ ఉంటోంది. ఓటీటీలు, థియేటర్లు అనే తేడా లేకుండా కొత్త కథలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే రిచి గాడి పెళ్లి అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనేది అర్థం అవుతోంది.

పెళ్లికి ముందు తన ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని అనుకుంటాడు హీరో. దాని కోసం అంతా కలిసి ఓ ప్రైవేట్ రిసార్ట్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే అక్కడకు చేరిన గ్యాంగ్ అంతా కలిసి ఓ ఆట ఆడుతారు. ఎవరికి ఏ ఫోన్ వచ్చినా కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడాలనే చాలెంజ్‌ను తీసుకుంటారు.

దీంతో కథ రకరకాలుగా మార్పులకు లోనవుతున్నట్టుగా ట్రైలర్ చూపిస్తోంది. దీంతో ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుందా? రొమాంటిక్ యాంగిల్ తీసుకుంటుందా? అన్నది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన హరీష్‌ శంకర్.. చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమాలా ఉందని హరీష్‌ శంకర్ అన్నాడు. ఆ చిన్న ఆట వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనేదే ఈ సినిమా కథాంశమని తెలుస్తోందని హరీష్‌ శంకర్ చెప్పుకొచ్చాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News