Venus Transit 2023: మరి కొద్దిగంటల్లో ఆ 5 రాశులకు తిరగనున్న దశ, ఊహించని లాభాలు, పదవులు

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటాడు. శుక్రగ్రహం మార్చ్ 12వ తేదీన మీన రాశి నుంచి బయటికొచ్చి మేష రాశిలో ప్రవేశించడం వల్ల మార్చ్ 12 వతేదీ ఉదయం 8 గంటల 13 నిమిషాల నుంచి ఈ 5 రాశులకు జీవితం మారిపోనుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటాడు. శుక్రగ్రహం మార్చ్ 12వ తేదీన మీన రాశి నుంచి బయటికొచ్చి మేష రాశిలో ప్రవేశించడం వల్ల మార్చ్ 12 వతేదీ ఉదయం 8 గంటల 13 నిమిషాల నుంచి ఈ 5 రాశులకు జీవితం మారిపోనుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

1 /5

ధనస్సు రాశి ఈ రాశి పంచమ పాదంలో శుక్రుడి గోచారం వల్ల ఈ రాశి జాతకులకు మంచి పరిణామాలు ఎదురౌతాయి. పెళ్లైనవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఎప్పట్నించో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సమస్యలు దూరమౌతాయి. డబ్బులు సంపాదించేందుకు అనువైన సమయం

2 /5

మీన రాశి జ్యోతిష్యం ప్రకారం మీన రాశి జాతకుల ద్వితీయ పాదంలో గోచారం ఉంటుంది. ఫలితంగా ఈ జాతకులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అత్తారింటి తరపున సంబంధాలు మెరుగుపడతాయి. పనిచేసేచోట మెరుగైన పరిస్థితులు కన్పిస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవల్సి వస్తుంది. ఆ ఖర్చుల్ని సేవింగ్స్‌పై కేంద్రీకరించాలి.

3 /5

సింహ రాశి జ్యోతిష్యం ప్రకారం శుక్రుడి గోచారం సింహ రాశి నవమ పాదంలో ఉంటుంది. ఇందులో ముందు నుంచే రాహువు ఉండటంతో శుక్ర, రాహు యుతితో పాజిటివ్ పరిణామాలు కలగనున్నాయి. ఏ నిర్ణయమూ తొందరపాటులో తీసుకోవద్దు. ఉద్యోగం మారాలనుకుంటే మంచి సమయం. మంచి అవకాశాలు లభిస్తాయి.

4 /5

మిధున రాశి శుక్రుడి గోచారం 11వ పాదంలో ఉండనుంది. ఈ సందర్భంగా శుక్ర, రాహు గ్రహాల యుతితో ప్రతి పనిలో లాభం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పనిచేసే చోట సీనియర్లు, సిబ్బంది సహకారం లభిస్తుంది. ఈ సమయంలో పదోన్నతి అవకాశాలుంటాయి.

5 /5

మేష రాశి జ్యోతిష్యం ప్రకారం శుక్రుడి గోచారం మేష రాశి లగ్నపాదంలో ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ రాశి జాతకులపై అంతా అనుకూల ప్రభావముంటుంది. ఈ జాతకం వ్యక్తులపై పాజిటివ్ పరిణామాలుంటాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆర్ధిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో అపారమైన వృద్ధి ఉంటుంది.