Pawan Kalyan: జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్.. కారణం ఇదే..!

Ysrcp Leaders Joined in Janasena: అధికార పార్టీ నుంచి పలువురు నేతలు జనసేన గూటికి చేరుకున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబుతోపాటు ఇతర నాయకులు పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2023, 05:37 PM IST
Pawan Kalyan: జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్.. కారణం ఇదే..!

Ysrcp Leaders Joined in Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు జనసేన వైపు చూస్తున్నారు. తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరిద్దరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకొన్నారు. వారితో పాటు భీమిలి వైసీపీ నేతలు చంద్రరావు, దివాకర్‌ తదితరులు పార్టీలో చేరారు. 

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎలక్షన్స్‌కు ముందు తెలుగుదేశం పార్టీని వీడి.. వైఎస్సార్సీపీలో చేరారు. అయితే పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదంటూ ఇటీవల ఆయన వాపోయారు. అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తానేటి వనిత గెలుపు కోసం కృషి చేస్తే.. మంచి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని.. అయితే అప్పటి నుంచి ఆయనను కలిసే అవకాశం రాలేదన్నారు. తనకు పార్టీ పదవి కూడా ఇవ్వలేదని.. తన కార్యకర్తలకు ఏమి చేయలేపోవడం బాధ కలిగించిదని అన్నారు. అందుకే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.

ఈదర హరిబాబు విషయానికి వస్తే.. ఆయన 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2014లో జడ్పీ ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సడెన్‌గా మళ్లీ జనసేనలో చేరి రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు.

జనసేన పార్టీ ఆవిర్భవించి మార్చి 14వ తేదీకి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని పవన్ కళ్యాణ్‌ నిర్ణయించారు. ఈ వేదిక నుంచి పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. అదేవిధంగా పొత్తులపై కూడా కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Also Read: IND vs AUS 4th Test: కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. సింగిల్ కోసం పిలిచి..  

Also Read: Virat Kohli: మూడేళ్ల తరువాత నెరవేరిన కోరిక.. అహ్మదాబాద్‌లో కోహ్లీ చారిత్రాత్మక ఇన్నింగ్స్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News