ఏపీ రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబందించిన డిజైన్ లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ చంద్రబాబు ప్రభుత్వానికి అందజేసింది. భవనానికి సంబంధించిన ప్రాథమిక ఆకృతులు, అంతర్గత నిర్మాణ శైలికి సంబంధించిన ప్రణాళికను ఇందులో పేర్కొంది. వజ్రాకృతిలో నిర్మంచతలపెట్టిన ఏపీ అసెంబ్లీ నూతన భవన విషేషాలు ఒక్కసారి తెలుసుకుందాం..
లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ రూపొందించిన ఏపీ అసెంబ్లీ వజ్రాకృతిలో ఉండనుంది. దీని కోసం మొత్తం 35 ఎకరాలు కేటాయించారు. 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణ ప్రాంతం ఉంటుంది. మొత్తం నాల్గు అంతస్తుల్లో దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. కాగా
మొదటి అంతస్తును నాలుగు భాగాలుగా రూపొందించారు. మధ్యలో పబ్లిక్ ప్లేస్ కేటాయించారు. మధ్యభాగం నుంచి పైకి వెళ్లేందుకు వర్తులాకారపు మెట్లు ఉంటాయి. 120 అడుగుల ఎత్తుకి వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని చూడొచ్చు.
భవనంలోని మొదటి అంతస్తును ముఖ్యమంత్రి,సభాపతి, పబ్లిక్, ప్రెస్ కార్యాలయాల కోసం కేటాయించారు. శాసనసభ శాసన మండలి కోసం రెండు వేర్వేరు భవనాలు ఈ సముధాయంలోనే అంతర్గతంగా ఉంటాయి. 250 సీట్లతో శాసససభమందిరాన్ని నిర్మాస్తారు. అవసరమైతే 300 సీట్లకు పెంచుకోవచ్చు. 125 సీట్లతో శాసనమండలి మందిరం ఉంటుంది.
త్రిభుజాకారంలో నిర్మించే బాల్కానీ శాసన సభ నిర్మాణానికే ముఖ్య అలంకారంగా ఉంటుంది. అసెంబ్లీ కింది అంతస్తులోని మధ్యభాగం నుంచి వజ్రాకతి మొదలౌతుంది. ఇది మొత్తం భవనంపై అంతస్తు వరకూ ఉంటుంది. పై భాగంలో వజ్రాకారం స్పష్టంగా కనిపిస్తుంది. పైభాగంలో మ్యూజియం ఉంటుంది. ప్రజలందరికీ ప్రవేశ ఉంటుంది. కాగా ఈ సరికొత్త అసెంబ్లీ నమూనాపై మంత్రులు, పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.