Konda Surekha Comments: సామ్‌కు అండగా కదిలిన తారాలోకం.. నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోం అంటూ జూ.ఎన్టీఆర్‌ ఆగ్రహం..

Cinema Industry Reaction on Konda Surekha Comments: నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లకు మొత్తం తెలుగు ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ హీరోయిన్‌ జీవితాన్ని ఒకరిని ఇరికించడం కోసం రాజకీయం చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. వ్యక్తిగతంగా తీసుకున్న విడాకులను రాజకీయ నేతకు అంటగట్టడంతో ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Oct 3, 2024, 10:41 AM IST
Konda Surekha Comments: సామ్‌కు అండగా కదిలిన తారాలోకం.. నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోం అంటూ జూ.ఎన్టీఆర్‌ ఆగ్రహం..

Minister Konda Surekha Comments: ఇక కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది హీరోయిన్ల జీవితంతో ఆడుకున్నాడు. వారి ఫోన్లను ట్యాప్‌ చేశాడు. డ్రగ్స్‌కు అలవాటుపడి వారిని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. చాలామంది కేటీఆర్‌ను భరించలేక పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు అని మంత్రిగారు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు ఏకంగా సమంతను నాగార్జునే కేటీఆర్‌ దగ్గరకు వెళ్లమన్నాడు. ఆమె వెళ్లకపోవండంతోనే విడాకులు అయ్యాయి. సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లుగా నిన్నటి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అంశం తీవ్ర దుమారంగా మారింది. ఒక్కక్కరిగా తెలుగు ఇండస్ట్రీ కదిలి వస్తుంది.

మొదటగా వెంటనే స్పందించిన నాగర్జున వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయడం ఏంటి వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు. అంతేకాదు నాగచైతన్య కూడా రీట్వీట్‌ చేశాడు. ఇక స్పందించిన సమంత నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు నేను దూరంగా ఉంటా. మేం వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నాం అని ట్వీట్‌ చేశారు. ఇలా సమంతకు ఒక్కక్కరుగా సపోర్ట్‌ చేశారు.

అమల కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మంత్రి హోదాలో ఉంటూ ఆ మాటలేంటి స్పందించాలని రాహుల్‌ గాంధీకి కూడా ట్యాగ్‌ చేశారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు అంటూ మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు లాగొద్దు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నవారు తప్పకుండా గౌరవాన్ని గోప్యతను పాటించాలి. సినీ ఇండస్ట్రీ ఇలాంటి నిరాధారమైన స్టేటెమెంట్లు చూస్తూ ఊరుకోదు ఈ విషయం తనను బాధించిందని పోస్టు పెట్టారు జూనియర్‌ ఎన్టీఆర్‌.

ఇదీ చదవండి : Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?  

బీజేపీ నేత కుష్బూ కూడా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకునేది లేదు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు ఆమె సారీ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకు ముందు ఎంటీ సిగ్గులేని రాజకీయాలు అంటూ విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలను అందరూ ఖండించాలి అంటూ హీరో సుశాంత్‌కు కూడా పోస్ట్‌ చేశారు. ఒక మంత్రి హీరోయిన్‌ను కించపర్చడం విని షాక్‌ అయ్యాను అన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవరనను అందరూ ఖండించాలి అని ట్వీట్‌ చేశాడు.

ఇదీ చదవండి : రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?   

ఇక ఏ చెత్త మాట్లాడిన చెల్లిపోతుందని రాజకీయ నాయకులు భావించడం జీర్ణంచుకోలేకపోతున్నా అని హీరో నాని కూడా స్పందించారు. ఇలా మీడియా సమావేశంలో మాటలు మాట్లాడటం సరికాదు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయాన్ని అందరూ ఖండించాల్సిందేనని అన్నారు. తన పై ఈ వ్యాఖ్యలకు కేటీఆర్‌ బుధవారమే లీగల్‌ నోటీసు పంపారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెంటనే వెనక్కి తీసుకోవాలి. దురుద్దేశపూర్వకంగా అబద్దాలు, అసత్యాలు మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్‌ లీగల్‌ నోటీసుల్లో డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News