ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ రైల్వే తాజాగా డెస్టినేషన్ అలెర్ట్ పేరిట మరో ఎస్ఎంఎస్ అలెర్ట్ విధానాన్ని ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకుంది. రైల్వే అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇకపై రిజర్వేషన్ టికెట్ కలిగిన ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు రైలు చేరుకోవడానికన్నా 20 నిమిషాలు ముందుగా వారిని అప్రమత్తం చేస్తూ ఓ ఎస్ఎంఎస్ అలెర్ట్ రానుంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పలు రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఈ అలెర్ట్ మెస్సేజ్ వస్తుందని లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెన్ వివరణ ఇచ్చారు.
రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు 139 నెంబర్ ద్వారానూ గమ్యస్థానానికి సంబంధించిన అలెర్ట్ మెస్సేజ్ పొందవచ్చని మంత్రి తెలిపారు.