Uric Acid Control in 7 Days with These Drinks: ప్యూరిన్-రిచ్ ఆహారాలు అధిక పరిమాణంలో తీసుకోవడం వల్లే యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కిడ్నీ పని తీరులో కూడా మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ విచ్చలవిడిగా పేరుకుపోతుంది. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కీళ్ల నొప్పులు పెరిగి ఇతర సమస్యలకు కూడా దారీ తీయోచ్చు. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి చాలా రకాల ఇంటి చిట్కాలున్నాయి. కానీ వేసవి కాలంలో ఈ యాసిడ్‌ను తగ్గించేందుకునేందుకు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ జ్యూస్‌లను తాగాల్సి ఉంటుంది. ఏయే రసాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సులభంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జ్యూస్‌లను తాగడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది:
1. స్ట్రాబెర్రీ జ్యూస్:
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి స్ట్రాబెర్రీ జ్యూస్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ప్రభావవంతంగా యూరిక్ యాసిడ్‌పై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా శరీరంలోని హానికరమైన రసాయనాలను తొలగించి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
2. నారింజ రసం:
పేరుకుపోతున్న యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకునేందుకు నారింజ రసం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్‌ను సులభంగా తగ్గిస్తుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. యూరిక్ యాసిడ్ తగ్గించుకునేందుకు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
3. అరటి జ్యూస్:
అరటిపండులో పొటాషియం విలువలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా మంది ప్రతి రోజూ అరటి పండుతో తయారు చేసిన జ్యూస్‌ని తాగుతారు. అయితే ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను కూడా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
4. నిమ్మరసం:
నిమ్మరసంలో తేనె కలిపి గోరువెచ్చని నీటితో తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువును తగ్గించి.. శరీరంలో సులభంగా కొలెస్ట్రాల్ నియంత్రించగలదు. అయితే ఇలా తాగితే యూరిక్ యాసిడ్‌ను కూడా సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా తగ్గించ గలదు. అంతేకాకుండా గుండె సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
5. యాపిల్ జ్యూస్:
యాపిల్ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలు బయటకు వస్తాయి. యాపిల్‌లో ఉండే మాలిక్ యాసిడ్ శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తగ్గించి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా సులభంగా నియంత్రింస్తుంది.
Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Uric Acid Control Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించి.. 7 రోజుల్లో కీళ్ల నొప్పులను దూరం చేసే డ్రింక్స్ ఇవే!