German Embassy Ambassador and staff dance to 'Natu Natu': రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమెరికాలో జరిగిన భారీ వేడుకలో ఈ అవార్డుల వేడుకలో ఈ అవార్డు అందుకున్నారు సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్. ఇక వీరు అవార్డులు అందుకున్న తర్వాత పెద్ద ఎత్తున అన్ని వైపులా నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక పలురకాలుగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఆస్కార్స్ 2023లో ఎస్ఎస్ రాజమౌళి RRRలోని నాటు నాటు అవార్డు అందుకున్న తర్వాత ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను సెలబ్రిటీలు, భారతదేశంలోని సామాన్య ప్రజలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్న నాటు నాటు సాంగ్ కు జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
అయితే ఇది ఎక్కడో విదేశాలలో చేయలేదు అండోయ్ న్యూ ఢిల్లీలోని చాందిని చౌక్ లో ఆయన తన ఎంబసీ సిబ్బందితో కలిసి చిందులేశారు. ట్విట్టర్‌లో, అంబాసిడర్ డా. ఫిలిప్ అకెర్‌మాన్ చాందినీ చౌక్ వద్ద రిక్షా దిగి దుకాణదారుని ఇండియాలో ప్రసిద్ధి చెందింది ఏది అని అడిగితే అతను నాటు నాటు ముద్రించిన కర్రతో పాటు జలేబీ ప్లేట్‌ను అంబాసిడర్‌కి అందజేస్తాడు. తరువాత, డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ అలాగే ఆయన టీమ్ సభ్యులు ఎర్రకోట సమీపంలోని రహదారిపై గుమిగూడి నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించారు. వారిని చూసేందుకు, ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడడం కూడా వీడియోలో కనిపించింది.
తెలుగు పాట అయిన నాటు నాటుకు భావం తెలియనప్పటికీ.. ఆ పాటలో బీట్ వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి ఈ మధ్యనే నాటు నాటు సాంగ్ ట్రిబ్యూట్ గా సౌత్ కొరియా ఎంబసీ సిబ్బంది కూడా డ్యాన్స్ వీడియో చేశారు. సౌత్ కొరియా ఎంబసీ వారి ఇన్సిపిరేషన్ తోనే తాము కూడా ఈ వీడియో చేసినట్లు జర్మనీ ఎంబసీ ఈ వీడియోలో పేర్కొంది. జర్మన్స్ డ్యాన్స్ చేయలేరా? ఏంటి? నేను నా సిబ్బంది కలసి నాటు నాటు ఆస్కార్ విజయాన్ని ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాం, ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే మా డ్యాన్స్ చాలా బ్యాడ్ గా ఉంది కానీ ఎంతో ఎంజాయ్ చేశామని అంబాసిడర్ పేర్కొన్నారు.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook