Chandrababu Sketch: పట్టభద్రుల ఎమ్మెల్సీలు మాత్రమే కాదు.. అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ కూడా గెలిచేలా బాబు స్కెచ్?

Chandrababu Master Plan on MLC Elections: ఇటీవల ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం టీడీపీ రచించిందని టాక్ వినిపిస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 18, 2023, 10:16 PM IST
Chandrababu Sketch: పట్టభద్రుల ఎమ్మెల్సీలు మాత్రమే కాదు.. అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ కూడా గెలిచేలా బాబు స్కెచ్?

TDP Strategy for MLA Quota MLC Seat: ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ గెలుపు జోష్ లో ఉంది. ఎందుకంటే ఇటీవల ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం రచించిందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సారి మొత్తం 7 అసెంబ్లీ కోటా స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే అధికార పార్టీ ఒకపక్క ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష టీడీపీ కూడా చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా తన అభ్యర్థి అయినా పంచుమర్తి అనురాధను రంగంలోకి దించింది.

ఇప్పుడున్న ఎమ్మెల్యేల లెక్కల ప్రకారం సభలో అధికార పార్టీకి 151 మంది, ప్రతిపక్ష పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రకారం తీసుకుంటే అధికార పార్టీ నుండి ఏడుగురు అభ్యర్థులకు ఒక్కొక్కరికి 21.57 ప్రధమ ప్రాధాన్యత ఓట్లు వస్తే, ప్రతిపక్ష టీడీపీకి 23 ప్రధమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి. అలా చూస్తే అధికార పార్టీ తన ఏడో అభ్యర్థి విజయాన్ని వదులు కుంటే తప్ప టీడీపీకి మించిన ఓట్లు తన ఆరుగురు అభ్యర్థులకు సాధించలేదని విశ్లేషకులు అంటున్నారు.

అయితే టీడీపీతో విభేదించి జై జగన్ అంటున్న నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ లు టీడీపీ ఇచ్చిన పార్టీ విప్ ధిక్కరిస్తే మాత్రమే టీడీపీ ఓటమి సాధ్యం అవుతుంది.  ఆలెక్కన తీసుకుంటే టీడీపీకి 19 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే  వస్తాయి, అయితే ఈ మధ్యనే పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు కూడా ఉంటుంది, అది కూడా కలిస్తే 20 ప్రధమ ప్రాధాన్యత ఓట్లు అవుతాయి. ఆ సమయంలో ఒకవేళ ఆ నలుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి అధికార పార్టీకి ఓటు వేసినా, అధికార పార్టీలోని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఇంకో ఒకరిద్దరు అసంతృప్త శాసనసభ్యులు ఓటు వేస్తే టీడీపీ గెలుపు ఆపడం సాధ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్రమంలో అధికార పార్టీ అసంతృప్తులు, తిరుగుబాటుదారులు అని భావిస్తున్న వారిని కట్టడి చేసుకోగలిగినా ఓ ఇద్దరు, ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఓటు చెల్లకపోతే కూడా టీడీపీ గెలుపు ఆపడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తంగా ఈ వ్యూహంతో అధికార పార్టీకి చంద్రబాబు ముచ్చెమటలు పట్టిస్తున్నారని పేర్కొంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు చేజారకుండా చూసుకుంటే తప్ప టీడీపీ అభ్యర్థిని ఓడించడం వైసీపీకి అంత తేలిక కాదని, ఎందుకంటే ఇక్కడ "పోల్ మేనేజ్మెంట్" చాలా కీలకం, ఆ పోల్ మేనేజ్మెంట్ లో చంద్రబాబుది అందెవేసిన చేయి అని అంటున్నారు. ఇలాంటి వ్యూహాల్లో చంద్రబాబుకు టీడీపీ నేతలు సహకరించినంతగా జగన్ కు తన పార్టీ నేతలు సహకరించడం లేదు అనేది ఇప్పటికే స్పష్టం అయింది కాబట్టే దాని ఫలితమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం, వైసీపీ పరాజయం అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని వింతలు చోటు చేసుకుంటాయో?

Also Read: Rain Fall Allert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు కుండపోతే.. హైదరాబాద్లో పరిస్ధితి ఏంటంటే?

Also Read: Sajjala on MLC Results: వచ్చిన ఓట్లన్నీ  టీడీపీవి కావు...మేము హెచ్చరికగా భావించడం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News