రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జన ఆశీర్వాద్ యాత్ర పేరిట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టిన యాత్రలో గురువారం సాయంత్రం ఓ అనుకోని అపశృతి చోటుచేసుకుంది. జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఛటర్పూర్ జిల్లా చంద్లా నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహన్.. అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభ వేదికపైకి ఎక్కి స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన అనంతరం సభా వేదికపై నుంచి కిందికి దిగి వచ్చే క్రమంలో మెట్టు ఉందనుకుని మెట్టులేని చోట పాదం మోపిన శివరాజ్ సింగ్ చౌహన్ ఒక్కసారిగా వేదికపై నుంచి జారి పడిపోయారు.
ముఖ్యమంత్రి వెంటే ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై అతడిని కిందపడకుండా ఒడిసి పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రికి ఎటువంటి హానీ జరగలేదని వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.