Coconut Water For Weight Loss: వేసవి కాలం ప్రారంభం కాబోతోంది. కాబట్టి చాలా మంది ఈ క్రమంలో దాహం తీర్చుకోవడానికి చాలా రకాల కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే అవి తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది, కానీ దీర్ఘకాలం పాటు ఉండదు. అయితే శరీరం దీర్ఘకాలం పాటు హైడ్రేటెడ్‌గా ఉండడానికి కొబ్బరి నీళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా శరీర బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి కొబ్బరినీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సులభంగా అధిక రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులను తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
ముఖంపై మెరుపును పెంచడానికి సహాయపడుతుంది:
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా చర్మానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైన సులభంగా తగ్గుతాయి. అయితే ఎండా కాలంలో చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొబ్బరి నీళ్లను తాగాల్సి ఉంటుంది.
శరీర బరువును తగ్గిస్తుంది:
కొబ్బరి నీళ్లలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్నిఎల్లప్పుడూ తాజాగా ఉంచుతుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణంలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ కొబ్బరి నీళ్లను తాగాల్సి ఉంటుంది.
ఎముకలు దృఢంగా మారతాయి:
ఎముక సంబంధిత వ్యాధులలో బాధపడుతున్నవారు ప్రతి రోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి కాల్షియం లభించి ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఎముకల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook