'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఏ దేశం చూసినా.. కరోనా మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 30వేలకు చేరువలో ఉన్నాయి.
దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 1680 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరోవైపు కరోనా వైరస్.. దేశ రాజధానిలో ఉన్న నీతి ఆయోగ్ లోకి కూడా ప్రవేశించింది. నీతి ఆయోగ్ లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ కార్యాలయంలో పారిశుద్ధ్యంపై ఎక్కువగా దృష్టిసారించారు. ఐనప్పటికీ ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం ఇప్పుడు గుబులు రేపుతోంది.
రెండు రోజులు నీతి ఆయోగ్ బంద్..!
'కరోనా వైరస్' రేపిన కలకలం కారణంగా.. నీతి ఆయోగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. రెండు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. ఉద్యోగులను ఆఫీసుకు రావొద్దని చెప్పేశారు. మరోవైపు నీతి ఆయోగ్ ఆఫీసులో అణువణువూ శుద్ధి చేస్తున్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వేగం తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. గత వారం రోజులుగా కొన్ని జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. మొత్తంగా 80 జిల్లాల్లో వారం రోజుల నుంచి ఒక్క కేసు నమోదు కాకపోవడం సంతోషకరమైన వార్త అని తెలిపారు. గత రెండు వారాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాల సంఖ్య 47గా ఉందని ఆయన వివరించారు. అలాగే గత 21 రోజుల్లో 39 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. అంతే కాదు 28 రోజులుగా 17 జిల్లాల్లో ఒక్క కేసు రికార్డు కాకపోవడం శుభపరిణామం అని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా సత్ఫలితాలు అందుతున్నాయని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నీతిఆయోగ్‌లో కలకలం..!!