7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..

7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్‌ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.8438కి పెంచాలని, ఈ పెంచిన మొత్తం 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలాగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు DOPPW (Department Of Personnel And Training) కేంద్రం సూచనలు జారీ చేసింది.

7Th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షర్లకు చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ (Da) ఇప్పటికే బేసిక్ పేలో 50 శాతంకి పైగా చేరింది. ఈ పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లుకు స్థిరమైన అటెండెంట్ అలవెన్స్ (CAA)లో 25% పెంపును పొందనున్నారని సమాచారం.. గత జనవరిలో డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచడం వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు వచ్చే జీతం లేదా పెన్షన్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు, పౌర పెన్షనర్లకు ఇచ్చే CAA కూడా 25% పెరిగింది.  ఈ పెంపు వల్ల పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రసుత్తం పబ్లిక్ గ్రీవెన్స్ , పెన్షన్ల మంత్రిత్వ శాఖ పౌర పెన్షనర్లకు CAAని పెంచుతున్నట్లు ప్రకటించింది.

1 /8

 ప్రతిసారి డియర్‌నెస్ అలవెన్స్ (DA) 50% పెరిగినప్పుడు, పెన్షన్ దారులకు చెల్లించే స్థిరమైన అటెండెంట్ అలవెన్స్ (CAA) కూడా 25% పెరుగుతుందని ఆఫీస్ మెమోరాండమ్‌లో డిపార్ట్‌మెంట్ క్లుప్తంగా తెలిపింది.  

2 /8

DOPPW కొత్త ప్రతిపాదనలో పౌర పెన్షనర్లకు చెల్లించే స్థిరమైన అటెండెంట్ అలవెన్స్ (CAA) ను నెలకు రూ.6750 నుంచి రూ.8438కి పెంచాలని సూచించింది. ఈ నిర్ణయం పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

3 /8

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. 

4 /8

కేంద్ర ప్రభుత్వ పౌర పెన్షనర్లు అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి నిర్ణీత కాలం పూర్తి చేసి పదవీ విరమణ చేసిన వ్యక్తులు. వీరు తమ సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి పెన్షన్‌ను పొందుతారు.

5 /8

కేంద్ర ప్రభుత్వ పౌర పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు లభింస్తాయి. అందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత లేదా తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయాలు, కొన్ని సందర్భాల్లో ఇతర భత్యాలు కూడా లభించే అవకాశం ఉంది.

6 /8

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనిష్ఠ పెన్షన్ నెలకు రూ. 9,000/-గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగికి కనీసం ఈ మొత్తం పెన్షన్ లభిస్తుంది.  

7 /8

50% డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ పెంపు కేవలం జీతాలను మాత్రమే కాకుండా అనేక రకాల అలవెన్సులను కూడా ప్రభావితం చేస్తోంది.

8 /8

హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) అనేది అత్యంత ప్రభావితమయ్యే అలవెన్సులలో ఒకటి. డీఏ పెరుగుదలతో HRA కూడా గణనీయంగా పెరుగుతుంది. కన్వేయన్స్ అలవెన్స్ కూడా ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది.. కాబట్టి, డీఏ పెరుగుదలతో ఈ అలవెన్స్ కూడా పెరుగుతుంది.