Big update on 8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి జీతాలు భారీగా జీతాలు పెరగబోతున్నట్లు సమాచారం
మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తొంది.
ఒక వైపు ప్రజలకు ఆర్థిక భారం కల్గకుండా చూడటంతో పాటు, మరోవైపు పాలనలో విప్లవాత్మక మార్పులతో మోదీ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది రెండు మార్లు డీఏ హైక్ లను కేంద్రం ప్రకటిస్తు ఉంటుంది.
జనవరి, జులై నెలల్లో ఈ పెంపుదలలు ఉంటాయి. ఇప్పటికే కేంద్రం దసరా వేళ 7 వ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి అన్ని వారి జీతాల్లో 53 శాతం పెరుగుదల అయిన విషయం తెలిసిందే.
అయితే.. మరోమారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం 8 పే కమిషన్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారంట. ప్రతి 10 సంవత్సరాలకు కొత్త పే కమిషన్‌లు ఏర్పాటు చేయబడుతుంది. 7వ వేతన సంఘం 2014లో ప్రకటించబడి 2016లో అమల్లోకి వచ్చింది. ఆ విధంగా తదుపరి వేతన సంఘం 8వ వేతన సంఘం 2026లో ఏర్పాటు చేయాలి.
దీనిలో చేసే సిఫారసుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పెన్షన్‌లు పెరుగుతు ఉంటాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా జీతం పెంపు నిర్ణయించబడుతుంది. కొత్త పే కమిషన్‌లో వేతన విధానంలో మార్పు ఉంటుంది. బేసీక్ పే, అలవెన్సులు మొదలైనవి సవరించబడతాయి.
అయితే.. 8 వ వేతన సవరణ సంఘం ఏర్పాటుపై 2025 లో కీలకమైన అప్ డేట్ ఉంటుందని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి హైక్ ఇస్తారని, జీతాలు ఏకంగా.. 42, 500 వరకు కూడా పెరగొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఇప్పటి వరకు మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ దీనిపైన తొందరలోనే మోదీ సర్కారు కీలక మైన అప్ డేట్ ఇస్తారని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
మరికొందరు మాత్రం.. 2025 కేంద్ర బడ్జెట్ సమయంలో 8వ వేతన సవరణ సంఘంలో తీసుకునే నిర్ణయాలు ప్రకటించబడుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2026 ప్రారంభం నాటికి 8వ వేతన సంఘం అమలులోకి రావచ్చని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలను Zee Mediaధృవీకరించలేదు)