RK Sagar Movies: బుల్లితెరపై మెరుపులు మెరిపించి.. వెండితెరపై వరుస సినిమాలతో బిజీ

The 100 Movie Poster: బుల్లితెరపై తన నటనతో స్టార్‌డమ్ సంపాదించుకున్న నటుడు ఆర్కే సాగర్.. ప్రస్తుతం వెండితెరపై బిజీగా మారిపోయారు. వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్న కథా చిత్రాలకు సైన చేసిన ఆయన.. మాస్ యాక్షన్ లవ్ స్టోరీలతో త్వరలో బాక్సాఫీసు ముందు సందడి చేయనున్నారు. ఆర్కే సాగర్ బర్త్ డే (ఆగస్టు 16) సందర్భంగా ది 100 మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
 

1 /6

ఆర్కే సాగర్ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  

2 /6

పిఠాపురంలో ఇంటింటికి వెళ్లి పవన్‌ను గెలిపించాలని ఆర్కే సాగర్ కోరారు. జనసేన విజయం తరువాత పవన్‌తో ఆర్కే సాగర్ ప్రత్యేకంగా భేటీ అయి.. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.  

3 /6

ఎన్నికల హడావుడి ముగిసిపోవడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఆర్కే సాగర్ బిజీగా మారారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.   

4 /6

ది 100 మూవీని క్రియా ఫిల్మ్ కార్ప్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఇప్పటికే మూవీకి అంతర్జాతీయంగా అవార్డులు వచ్చాయి.  

5 /6

ది 100 మూవీ పోస్టర్‌ విషయానికి వస్తే.. ఆర్కే సాగర్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.  

6 /6

ఆర్కే సాగర్ మరో రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. పెద్ద బ్యానర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభంకానుంది.