Pawan Kalyan Meets Amit Shah: హోం మంత్రిత్వ శాఖపై.. ఏపీ పోలీసుల పనితీరుపై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టడం కలకలం రేపుతోంది. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది.
తొలి భేటీ: ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు.
ప్రత్యేక సమావేశం: ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం మధ్యాహ్నం న్యూఢిల్లీ వెళ్లి అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
కీలక అంశాలపై చర్చ: కొన్ని నిమిషాల పాటు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారని సమాచారం. సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది.
ఏపీ విషయాలపై: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన.. శాంతి భద్రతలు.. అభివృద్ధిపై చర్చించుకున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కీలక ప్రాధాన్యం: ఏపీలో శాంతి భద్రతల వైఫల్యంపై ప్రశ్నించిన మరుసటి రోజే కేంద్ర మంతి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇతర అంశాలు: వీరిద్దరి మధ్య భేటీలో సనాతన ధర్మంతోపాటు తిరుమల లడ్డూ వివాదం, టీటీడీ పాలకమండలి, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది.