చకా.. చకా.. చురుగ్గా. . .!!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. .  భారత పర్యటకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఎటు చూసినా ..ట్రంప్, మోదీ ఫ్లెక్సీ పోస్టర్లే కనిపిస్తున్నాయి.

  • Feb 23, 2020, 13:50 PM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. .  భారత పర్యటకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఎటు చూసినా ..ట్రంప్, మోదీ ఫ్లెక్సీ పోస్టర్లే కనిపిస్తున్నాయి.  ఆయన సెక్యూరిటీ కోసం భారత, అమెరికా రక్షణ దళాలు అన్ని చర్యలు తీసుకున్నాయి. అహ్మదాబాద్‌లో కాన్వాయ్ ఎలా వెళ్లాలో రిహార్సల్స్ కూడా చేశారు. 

1 /8

కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ట్రంప్ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. 

2 /8

3 /8

మొతేరా స్టేడియంను ప్రారంభించేందుకు 22 కిలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లనున్నారు ట్రంప్. ఈ క్రమంలో ఆయన ర్యాలీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన కాన్వాయ్ ఎలా వెళ్తుందో.. అప్పుడు ఎలా భద్రత చూసుకోవాలో..  పోలీసులు రిహార్సల్స్ చేశారు. 

4 /8

5 /8

ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రాక కోసం  గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం ఎదురు చూస్తోంది. మహాత్మాగాంధీ నడయాడిన నేలను ట్రంప్ సందర్శించనున్నారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. కాసేపు గాంధీ ఆశ్రమంలోనే ఉండి విశేషాలను తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సబర్మతి ఆశ్రమంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 

6 /8

7 /8

మరోవైపు ఇండియా గేట్ వద్ద కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి భవన్ లో డోనాల్డ్ ట్రంప్.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు స్వీకరించనున్నారు.

8 /8

ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ ను ముస్తాబు చేశారు. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది.