AP Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు..

AP Rains: గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అతలా కుతలైమన ఆంధ్ర ప్రదేశ్ ఇపుడిపుడే సాధారణ పరిస్థితులకు వస్తుంది. ఏపీలో గత నెల సంభవించిన వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో మరో ఉపరితల ఆవర్తనం సందర్బంగా రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

1 /5

AP Rains: బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో APవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

2 /5

ఈ నెలలోనే అరేబియాలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

3 /5

నిన్న తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

4 /5

రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది.

5 /5

కావలిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలుగా నమోదైంది. విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x