Anupama Parameswaran: మరోసారి హాట్ గ్లామర్ ట్రీట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్  తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.  తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో  పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.

1 /6

అనుపమ పరమేశ్వరన్.. ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అనుపమ లిల్లి జోసెఫ్ పాత్రలో తన మార్క్ నటనతో అదరగొట్టేసింది.

2 /6

మలయాళీ భామ అయిన అనుపమకు ప్రారంభంలో తెలుగులో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి పోయాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో ముందుగా అనుపమనే అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారు. ఒకవేళ ఈ పాత్ర అనుపమకు దక్కి ఉంటే ఆమె రేంజే వేరే లెవల్లో ఉండేది.

3 /6

ప్రస్తుతం అనుపమ  స్టార్ హీరోల సరసన కాకుండా మిడ్ రేంజ్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. నిఖిల్ సిద్దార్ధ్ తో చేసిన ‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.

4 /6

అనుపమ పరమేశ్వర్ కేరళ రాష్ట్రంలోని ఇరంజకుడాలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. అంతేకాదు మలయాళ క్లాసిక్ బ్లాక్ బస్టర్  ‘ప్రేమమ్’ మూవీతో తెరంగేట్రం చేసింది. అందులో మేరీ జార్జ్ పాత్రలో హీరో ఫస్ట్ లవర్ పాత్రలో అదరగొట్టింది.

5 /6

అదే సినిమా తెలుగులో అదే ప్రేమమ్ టైటిల్ తో నాగ చైతన్య హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమగా చైతూ ఫస్ట్ క్రష్ గా అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

6 /6

తాజాగా ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ అందుకున్నా.. అనుపమకు పెద్దగా పేరొచ్చింది లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో వివిధ భాషల్లో అర డజనుకు పైగా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.