Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?

Ttd chairman br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాలకు కేంద్రంగా మారిందని తెలుస్తొంది. ఇటీవల ఏపీ సర్కారు తిరుమల బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించిన విషయం తెలిసిందే.

1 /8

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డును ఇటీవల ఏపీ సర్కారు ఏర్పాటు చేసింది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గాను,  పాటు మొత్తంగా 23 మందికి టీటీడీలో స్థానం కల్పించినట్లు తెలుస్తొంది.

2 /8

అయితే.. ఎప్పుడైతే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా ఎంపిక చేశారో అప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద అంశం వార్తలలో ఉంటుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు గత ఐదేళ్లలో తాను తిరుమలకు వెళ్లలేదని వ్యాఖ్యలు చేశారు.  

3 /8

గత సర్కారు హయాంలో తిరుమలలో తప్పిదాలు జరగడం వల్ల తాను వెళ్లలేదన్నారు. అయితే.. వైసీపీ మాత్రం బీఆర్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.  

4 /8

తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి ఏపీలో ఏ ప్రభుత్వం ఉంటే..వారికేంటని అన్నారు. దీన్ని బట్టి పవిత్రమైన టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి.. బీఆర్ నాయుడు రాజకీయాలు మాట్లాడుతున్నారని వైసీపీ ఏకీపారేస్తుంది.

5 /8

అయితే.. తాజాగా బీఆర్ నాయుడు మరో వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తొంది. ఆయన టీటీడీలో ఉన్న అన్యమతస్థులను ఇతర డిపార్ట్ మెంట్ లకు సర్దుబాటు చేస్తామంటూ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. తిరుమల శ్రీవారి సేవల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.  

6 /8

దీనిపై తాజాగా, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘూటుగా స్పందించారు. తిరుమల ఏవడి సోమ్మంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ కేంద్రంలో తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు కూడా చోటు కల్పిస్తు బిల్లు తీసుకొచ్చారన్నారు.  

7 /8

హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు.ఒక వేళ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు అవకాశం ఇచ్చినట్లు, టీటీడీ లో కూడా ఇతరులు ఉంటే మీకు ఏంటని అన్నారు.

8 /8

ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు మరోక న్యాయమా అంటూ కూడా మీడియా సమావేశంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మాత్రం రెండు తెలుగు స్టేట్స్ తో పాటు, కేంద్రం రాజకీయాల్లో కూడా కాక రేపుతున్నాయని చెప్పుకోవచ్చు.