Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్‌ అప్డేట్‌..

Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు. సొంత ఇళ్లు ఉన్నవారికి ఆరోజే రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు, సొంత ఇళ్లు ఉన్నవారికి రూ.5 లక్షలు ప్రకటిస్తామని చెబుతోంది. అంతేకాదు సొంత ఇంటి జాగా లేని వారికి కూడా స్థలాలను ఇప్పిస్తామని ప్రకటించింది.  

2 /5

నేడు ఈ పథకంపై కీలక అప్డేట్‌ వచ్చింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సొంత ఇల్లు ఉన్నవారికి నిధుల విడుదలకు కీలక సమాచారం అందించారు.   

3 /5

దశల వారీగా నియోజకవర్గాల్లో మొదటి దశలో 3500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు దశలవారీగా సొంత ఇల్లు ఉన్నవారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు.  

4 /5

ఈ పథకంలో ఇంటి యజమానిగా మహిళలనే గుర్తిస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోపల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తామని అన్నారు.  

5 /5

అయితే, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత సొంత ఇళ్లు ఉన్నవారికి నిధులు మంజూరు చేస్తామని గతంలో పొంగులేటి చెప్పారు. ఆ తర్వాత ఇళ్ల స్థలాలను కేటాయిస్తామన్నారు.