Bjp mp Rajiv Pratap rudy: దేశంలో పాము కాటు ఘటనలు ఎక్కువయ్యాయని ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ప్రతి ఏడాది యాభైవేల మంది వరకు కూడా పాముకాటుకు గురౌతున్నట్లు తెలుస్తోంది.
వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. అడవులు, చెట్లు ఉన్న చోట ఇళ్లలో పాములు ఎక్కువగా వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. పొలాలు, ఇళ్లలోనికి కూడా పాములు బైటకు వస్తుంటాయి. ఎలుకల వేటలో ఇవి ఇళ్లలోకి వస్తుంటాయి.
పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురౌతుంటారు. ఇలాంటి నేపథ్యంలో.. కొందరు పాముకాటుకు గురైనప్పుడు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్తుంటారు. సమయానికి యాంటీవీనమ్ తీసుకొని పాము కాటు నుంచి బైటపడుతారు.
కానీ మరికొందరు మాత్రం.. పాము కాటుకుబలౌతుంటారు. ఈ నేపథ్యంలో పాముల కాట్ల ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ నేపథ్యంలో.. లోక్ సభలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది యాభై వేల మంది వరకు కూడా పాము కాటుకు గురౌతున్నట్లు చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా పాము కాటు మరణాల్లో అత్యధికంగా భారత్ లోనే చోటుచేసుకుంటున్నాయని ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది మనదేశంలో.. 30 నుంచి 40 లక్షల మంది..పాముకాటుకు గురౌతున్నారు. వీరిలో యాభైవేల మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా బీహర్ లో.. పేదరికంతోపాటు, నేచర్ వైపరీత్యాలు సైతం సంభవిస్తున్నాయని ఎంపీ అన్నారు. వాతావరణ మార్పులపై కూడా ఎంపీ లోక్ సభలో చర్చించారు. దీంతో దేశంలో ఒక్కసారిగా పాముకాటు ఘటన వార్తలలో నిలిచింది.
వర్షాకాలంలో పొలంపనులకు వెళ్లే వారు.. అడవులదగ్గర ఇళ్లు ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని కూడా నిపుణులు చెబుతున్నారు. పాములు కన్పిస్తే ,వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.