Business Ideas: ఆవు పేడ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన దేశంలో ఆవు పేడ వినియోగం చాలా వరకు తగ్గింది. కానీ ఇందులోని విశేషాలు తెలుసుకుని విదేశీలు దీనిని వాడటం మొదలు పెట్టారు. మనం దేశం నుంచి వేల టన్నుల ఆవుపేడ ఎగుమతి అవుతుందంటే విదేశాల్లో ఆవుపేడకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశాల నుంచి ఆవు పేడ ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. దీంతో మన దేశంలో ఆవు పేడ ధర కూడా భారీగానే పెరిగింది. మరి విదేశాల్లో ఆవుపేడకు ఇంత డిమాండ్ ఎందుకు..దేనికోసం వినియోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Business Ideas: ఆవు పేడ అనగానే ముఖం అదోలా పెడుతుంటాం. దశాబ్దం క్రితం గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఆవుపేడతో వాకిల్లు కనిపించేవి. కానీ ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చి అవి కనుమరుగయ్యాయి. కానీ ఆవు పేడ కాసులు కురిపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా. ఇది వ్యాపారంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆవుపేడను విదేశాలకు ఎగుమతి చేస్తే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
గత కొన్నాళ్లుగా భారత్ నుంచి ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరిగింది. మన దేశం నుంచి అనేక దేశాలకు ఆవు పేడను ఎగుమతి చేస్తోంది. ఈ దేశాలు ఆవు పేడను చాలా రకాలుగా ఉపయోగిస్తాయి. ఈ దేశాల్లో కువైట్, అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశాలు భారతదేశం నుండి ఆవు పేడతో ఏమి చేస్తున్నాయో..దానికి వారు ఎంత ధర చెల్లిస్తున్నారో తెలుసుకుందాం.
ఆవు పేడను పొడి రూపంలో వాడటం వల్ల ఖర్జూరం చెట్లు పెరుగుతాయని పరిశోధనలో ఈ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఖర్జూర పంటలో ఆవు పేడ పొడిని ఉపయోగించడం వల్ల పండు పరిమాణం పెరగడంతోపాటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. దీంతో తమ ఖర్జూరాల ఉత్పత్తిని పెంచుకునేందుకు కువైట్, అరబ్ దేశాలు భారత్ నుంచి ఆవు పేడను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి.
చమురు, గ్యాస్ నిల్వలు ఉన్న కువైట్, అరబ్ దేశాలు తమ ఖర్జూర పంటను పెంచడానికి ఆవు పేడను దిగుమతి చేసుకుంటాయి. కొంతకాలం క్రితం, కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను భారతదేశానికి ఆర్డర్ చేసింది.
ఆవు పేడ అవసరాన్ని, దాని ప్రయోజనాలను భారతదేశం నుండి ఎగుమతి చేస్తున్న ఆవు పేడ ధర నుండి అంచనా వేయవచ్చు. ప్రస్తుతం భారతదేశం ఆవు పేడను కిలో రూ.30 నుంచి 50 వరకు ఎగుమతి చేస్తోంది. సహజంగానే, దాని డిమాండ్ కాలక్రమేణా పెరుగుతుంది, ధరలు మరింత పెరుగుతాయి.
వ్యవసాయ దేశమైన భారతదేశంలో పశువుల సంఖ్య కూడా చాలా పెద్దది. నివేదికల ప్రకారం భారతదేశంలో దాదాపు 30 కోట్ల పశువులు ఉన్నాయి. దీని వల్ల ప్రతి రోజు 30 లక్షల టన్నుల ఆవు పేడ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో, బయోగ్యాస్ తయారీలో, ఆవు పేడ నుండి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడంలో ఆవు పేడ కేకులను ఇంధనంగా ఉపయోగిస్తారు. దీనిని ఎరువుగా విరివిగా ఉపయోగిస్తారు.
మీ ఏదైనా బిజినెస్ ప్రారంబించాలని ఆలోచించినట్లయితే ఆవే పేడ వ్యాపారం ప్రారంభించవచ్చు. పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ పేడను విదేశాలకు ఎగుమతి చేస్తే డిమాండ్ ను బట్టి కోట్ల రూపాయలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది.