Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల కమ్ముకున్న పొగమంచు..

Cold Wave in Telugu States: తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే..ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చాలా గ్రామాలు ఆరెంజ్‌ అలర్ట్‌  కొనసాగుతోంది.

 

1 /7

Cold Wave in Telugu States: తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌ పట్టణంలో 6 డిగ్రీలు, కుమురం భీం జిల్లాలోని సిర్పూర్‌- యు లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే ఒణికిపోయే పరిస్థితులు నెలకున్నాయి. ముఖ్యంగా ఉదయం రోడ్డు ఊడ్చే పారిశుద్ధ కార్మికులతో పాటు ఉదయం డ్యూటీకి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2 /7

ముఖ్యంగా  ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యంత కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 6.3, అల్మాయిపేట్‌ 7.3, మల్‌చెల్మ 7.5, నల్లవల్లి 7.7, అల్గోల్‌ 7.9, సత్వార్‌ 8.1, లక్ష్మీసాగర్, బీహెచ్‌ఈఎల్‌ 8.2, మొగుడంపల్లి, నిజాంపేట్‌ 8.5, ఝరాసంగం 8.7, కంకోల్‌లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీం జిల్లా ఏజెన్సీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది.

3 /7

తెలంగాణ ప్రజలను నాలుగు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది.  రాబోయే రోజుల్లో దక్షిణాది జిల్లాల కంటే ఉత్తరాదిలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండడంతో చలి మరింత పెరిగిందని ఆయన వివరించారు. తెలంగాణలో శీతాకాలం మొదలు సాధారణ స్థాయి కంటే చలి తీవ్రత ఎక్కువే అంటోంది.

4 /7

సాధారణ ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఆదిలాబాద్​లో 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయాయి. అలా దాదాపు అన్ని జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల తగ్గి కనిష్ట ఉష్ణోగ్రతలు  నమోదు అవుతున్నాయని తెలిపింది.  రాబోయే రోజుల్లో తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్ , సిద్ధిపేట జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉంటుందని తెలిపింది. ఆయా జిల్లాలకు లో ఎల్లో అలర్ట్‌  జారీ చేసింది.

5 /7

సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వివరించింది.  రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తున్నాయని, దాని ప్రభావంతోనే గత నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య గాలులతో పాటు రాష్ట్రంపై తూర్పు గాలుల ప్రభావం కూడా ఉందంటోంది.  ఈ గాలుల కారణంగా ఉదయం వేళ దట్టమైన పొగ మంచు కురిసే అవకాశముంటోంది.

6 /7

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రతో పాటు పొగ మంచు ఎక్కువగా కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఎప్పుడైతే ఈశాన్య గాలులు నాగపూర్​ నుంచి దాటి కిందకి వస్తుంటాయో అప్పుటే వెస్ట్రన్​ డిస్టబెన్స్​న్స్​ ప్రభావం రాష్ట్రంపై అధికంగా ఉంటుందని తెలిపారు.

7 /7

హైదరాబాద్​లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని అభిప్రాయపడింది. మరోవైపు ఏపీలో మన్యంతో పాటు అరకు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ ఎపుడో దాటిపోయింది. దీంతో అక్కడ ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావడం లేదు.