IPL 2020 CSK vs SRH: ఫోటోల్లో మొత్తం మ్యాచ్ హైలైట్స్

  • Oct 03, 2020, 12:00 PM IST

ఐపీఎల్ 2020  లో 14 వ మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, డేవిడ్ వార్నర్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు చెన్నైను 7 పరుగుల తేడాతో ఓడించింది. చిత్రాల ద్వారా ఈ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.

1 /12

టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ టాస్ గెలవడంతో ముందు బ్యాటింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు.  ( Photo-BCCI/IPL)

2 /12

హైదరాబాద్ టీమ్ ఆరంభంలో తడబడింది. చైన్నై బౌలర్ దీపక్ చహర్ ఓపెనర్ జారీ బెయిర్ స్టోని స్టార్టింఘ్ లోనే అవుట్ చేశాడు.  ( Photo-BCCI/IPL)

3 /12

కెప్టెన్ డెవిడ్ వార్నర్ మ్యాచును నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ( Photo-BCCI/IPL)  

4 /12

మనీష్ పాండే స్కోర్ ను ముందుకు తీసుకెళ్లి 29 పరుగులు చేశాడు.  ( Photo-BCCI/IPL)

5 /12

కేన్ విలియమ్సన్ హైదరాబాద్ టీమ్ ను ఆదుకుంటాు అనుకున్నారు. కానీ 9 పరగులకే ఔట్ అయ్యాడు.  ( Photo-BCCI/IPL)

6 /12

ఆ తరువాత ప్రియమ్ గార్గ్ 51 పరుగులు, అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి టీమ్ కు మంచి స్కోర్ ను ఇవ్వగలిగారు.  ( Photo-BCCI/IPL)

7 /12

టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో బరిలోకి దిగిన చెన్నై టీమ్ కూడా ప్రారంభంలో ఇబ్బంది పడింది. ఓపెనర్ షేన్ వాట్సన్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి వెనుతిరిగాడు .  ( Photo-BCCI/IPL)    

8 /12

పాఫ్ డు ప్టెసి టీమ్  కోసం కేవలం 20  పరుగులు మాత్రమే చేయగలిగాడు.  ( Photo-BCCI/IPL)

9 /12

అంబటి రాయుడు కేవలం 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ( Photo-BCCI/IPL)

10 /12

కెప్టెన్ ధోనీ తనవంతు ప్రయత్నం చేస్తూ 47 పరుగులు చేశాడు. ధోనీ-జడేజా కలిసి విజయం కోసం ప్రయత్నించారు.  ( Photo-BCCI/IPL)

11 /12

మ్యాచులో చివరి ఓవర్ ను అబ్దుల్ఖ సమద్ వేశాడు. వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.  ( Photo-BCCI/IPL)

12 /12

హైదరాబాద్ టీమ్ విజయంలో కీలకంగా మారిన ప్రియం గార్గ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచు లభించింది.  ( Photo-BCCI/IPL)