Deputy CM Pawan Kalyan: వాలంటీర్ల వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి: డిప్యూటీ సీఎం పవన్‌..

Deputy CM Pawan Kalyan On Volunteers: వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, రాష్ట్ర సర్పంచుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే పంచాయితీలకు రూ.750 కోట్లు నిధులు జమా అవుతాయి అన్నారు. అంతేకాదు వాలంటీర్ల వ్యవస్థ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. 
 

1 /5

ఏపీ పంచాయితీరాజ్‌ ఛాంబర్ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను మోసం చేసిందని అన్నారు. జీతాలు పెంచుదామంటే జోవోలు లేవు, ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు లేవు అన్నారు.  

2 /5

అసలు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి తగిన రికార్డులు ఉంటే కదా.. ఇదో సాంకేతిక సమస్యగా మారిందన్నారు.ఇక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో పంచాయితీలకు రూ.750 కోట్లు నిధులు జమా అవుతాయన్నారు.  

3 /5

గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఇక అమరావతిలో సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు గురువారం. హోంమంత్రి అనితపై పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.  

4 /5

సోషల్‌ మీడియాలో పోలీసులకు సంబంధించిన పోస్టులపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌పై మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. తానే హోం మంత్రి బాధ్యతను తీసుకునే సమయం వస్తుందని పవన్‌ అన్న విషయంపై సీఎం తో ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇద్దరితో కలిసి ఈ మీటింగ్‌ ఏర్పాటు చేశారు  

5 /5

ఈ నేపథ్యంలో ఇద్దరినీ సీఎం చంద్రబాబు సమావేశపర్చారు. అయితే, జగన్‌ ప్రభుత్వం లో క్రియాశీలకంగా ఉన్నవారే ప్రస్తుతం అధికార పోస్టుల్లో ఉండటంపై కూడా చర్చ జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎంపై ఆ రాష్ట్రంలోనే తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి.ఇటీవల ఏపీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం, హోం మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. కొన్ని కీలక ఆదేశాలు కూడా పవన్, హోం మంత్రికి ఇచ్చారు.