Devara Heroine: ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘శృతి మరాఠే’ గురించి ఈ విషయాలు తెలుసా..!

Devara: ‘దేవర’ మూవీతో  జాన్వీ కపూర్ తో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది మరో  ముంబై భామ. ఆమె ఎవరో కాదు. మరాఠీలో పలు చిత్రాల్లో నటించిన శృతి మరాఠే.

1 /6

మరాఠీ యాక్ట్రెస్ శృతి మరాఠే ‘దేవర’ సినిమాలో లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. ‘దేవర’ భార్య పాత్రలో యాక్ట్ చేసింది. వరద (వర) తల్లి పాత్రలో నటించింది.

2 /6

2008లో మరాఠి చిత్రంతో రంగ ప్రవేశం చేసి ఈమె అక్కడ పలు చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో శృతి మరాఠే’కు ఇదే ఫస్ట్ మూవీ.

3 /6

‘దేవర’ లో శృతి  పాత్రను ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈమె మరాఠీ, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో హిట్టైన ‘ముంజ్యా’ చిత్రంలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.

4 /6

‘దేవర’ మూవీతో తంగం పాత్రలో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. సెకండ్ పార్ట్ లోనే ఈమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందట.

5 /6

సైఫ్ అలీ ఖాన్ నేరుగా తెలుగులో నటిస్తూన్న ఫస్ట్ మూవీ ‘దేవర’. ‘బైర’ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ తో సరిసమానమైన పాత్ర.

6 /6

‘దేవర’ మూవీని 1980-90ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మొత్తంగా ‘దేవర’ మూవీతో జాన్వీ, శృతి మరాఠే తో పాటు సైఫ్ అలీ ఖాన్ ముగ్గురు ముంబైకు చెందిన వాళ్లు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.