Balu Gaani Talkies: ఓటీటీలో అదరగొడుతున్న ‘బాలు గాని టాకీస్’.. ఆహాలో టాప్‌లో ట్రెండింగ్

Balu Gaani Talkies Streaming in Aha: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌ ద్వారా ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. అదేజోరుతో సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకున్నారు. ఒకప్పుడు అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం టాలెంట్‌ను నిరూపించుకునేందుకు అనేక వేదికలు ఉన్నాయి. ఇండస్ట్రీలోనూ కొత్త తరం హవా నడుస్తోంది. చాలామంది కొత్త దర్శకులు, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. యంగ్ డైరెక్టర్స్ తమ టాలెంట్‌తో సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన డైరెక్టర్ విశ్వనాథ్ ప్రతాప్ బాలు గాని టాకీస్ అంటూ ఆడియన్స్‌ను అలరించారు.
 

1 /5

శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేరుగా ఈ సినిమాలో ఓటీటీలో రిలీజ్ అయింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.   

2 /5

ఈ సినిమాను శ్రీనిధి సాగర్ నిర్మించగా.. రూపక్ ప్రణవ్ తేజ్, గుడిమిట్ల శివ ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.  

3 /5

ప్రస్తుతం ఆహాలో బాలు గాని టాకీస్ మూవీ దూసుకుపోతుంది. టాప్-2లో ట్రెండ్ అవుతుండడం విశేషం.  

4 /5

విలేజ్ రివేంజ్, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  

5 /5

డైరెక్టర్ విశ్వనాథ్ ప్రతాప్ తన మేకింగ్‌తో అందరినీ మెప్పించారు.