Chiranjeevi Dupe: సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా నటిస్తోంది ఈ కొరియోగ్రాఫరా.. ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ..

Chiranjeevi Dupe: చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేదు. డాన్స్,  ఫైట్స్ తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఎంతటి కథానాయకుడు అయినా.. కొన్ని సీన్స్ లో డూప్ నటించాల్సిందే. ఇక మెగాస్టార్ కు గత మూడు దశాబ్దాలుగా ఓ వ్యక్తి డూప్ గా నటిస్తున్నరు. ఇంతకీ ఎవరంటే..

1 /7

మెగాస్టార్ చిరంజీవి తన  46 యేళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తన యాక్టింగ్ మరియు డాన్సింగ్ స్కిల్స్ తో మెప్పించారు. అందులో ఎన్నో సాహోసేపేతమైన సన్నివేశాల్లో నటించారు.

2 /7

సినిమాల్లో ఎక్కువగా రియల్ స్టంట్స్ చేసే చిరు.. ఒక్కోసారి చేసే రియలిస్టిక్ సన్నివేశాల్లో గాయపడితే.. మొత్తం షూటింగ్ అప్ సెట్ అవుతుంది.

3 /7

కొన్ని సీన్స్ లో హీరోలకు ఆయా సీన్స్ చేయాలని ఉన్నా..  దర్శకులు, నిర్మాతలు ఇతర యూనిట్ సభ్యులను దృష్టిలో పెట్టుకొని కొన్ని సీన్స్ లో డూప్ తో కానిచ్చేస్తారు.  

4 /7

సినిమాల్లో కూడా ఎక్కువగా రిస్కీ అనుకున్న సీన్స్ మాత్రమే డూప్ తో తెరకెక్కిస్తుంటారు ఆయా దర్శక, నిర్మాతలు. ఇక చిరుకు ఓ వ్యక్తి మూడు దశాబ్దాలకు పైగా డూప్ గా నటిస్తున్నాడు. చిరు తన మూవీల్లో చేయాల్సిన రిస్కీసీన్స్ ను ఈయనే చేస్తున్నాడు.ఆయా సీన్స్ తో మెగాస్టార్ చిరుకు దగ్గరయ్యాడు.

5 /7

ఆయన ఎవరో కాదు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్. ఈయనది పాల్లకొల్లులోని మార్టూరు. ఈయన తన పేరు మీద 'ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్' అంటూ ఓ డాన్సింగ్  కంపెనీ ఉంది. ఈయన ప్రముఖ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో చిరుకు డూప్‌గా నటిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

6 /7

పలు సినిమాలకు ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. చిరంజీవి విషయానికొస్తే.. గతేడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో పలకరించారు. మరోవైపు ఈ యేడాది చిరంజీవిని కేంద్రం పద్మవిభూషణ్ తో గౌరవించింది.

7 /7

ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.