Doomsday Glacier Pics: మనకు తెలియకుండానే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, మార్పులు మొత్తం మానవాళిని ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. అంటార్కిటికాలోని డూమ్స్‌డే గ్లేసియర్‌కు సంబంధించి వెలుగుచూసిన అధ్యయనం ఇప్పుడు భయపెడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ భారీ గ్లేసియర్ అత్యంత వేగంగా కరుగుతోంది. ఇది మొత్తం ప్రపంచానికే ప్రమాదంగా పరిణమిస్తోంది.
సువిశాలమైన పశ్చిమ అంటార్కిటికా మంచు ప్రాంతంలో విస్తరించిన గ్లేసియర్‌నే డూమ్స్‌డే గ్లేసియర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ గ్లేసియర్ సామర్ధ్యం ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాన్ని 10 అడుగుల వరకూ పెంచగలదు. దిగువ తీర ప్రాంతాల్ని ముంచెత్తి లక్షలాదిమందిని ప్రభావితం చేయగలదు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ అతిపెద్ద గ్లేసియర్ కరుగుతోంది. అంటార్కిటికాలోని డూమ్స్‌డే గ్లేసియర్ ఇప్పుడు చాలా వేగంగా కరుగుతోందనే సమాచారం ఆందోళన కల్గిస్తోంది.
డూమ్స్‌డే గ్లేసియర్ విషయంలో శాస్త్రవేత్తలకు ఆందోళన అధికమౌతోంది. అంటార్కిటికా కరగడం అంటే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం పెరగడమే. ఈ ఒక్క గ్లేసియర్ 5 శాతం ప్రభావం చూపిస్తుంది.
మానవ చర్యల కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. ఇప్పుడు ఒక్కసారిగా నష్టాన్ని పూడ్చడం కష్టమే. డూమ్స్‌డే గ్లేసియర్ ఒక్కసారిగా కరిగితే సముద్రమట్టం ఒకేసారి 2 అడుగులు పెరుగుతుంది.
ఈ గ్లేసియర్ పూర్తిగా కరిగితే సముద్రమట్టంలో 4 శాతం పెరుగుదల కన్పిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ చూపించే భయంకర పరిణామాలు రానున్న రోజుల్లో చూడవచ్చు
డూమ్స్‌డే గ్లేసియర్ ఇప్పుడు గతంతో పోలిస్తే వేగంగా కరుగుతోందనే నివేదికలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం పెరుగుదలపై దీని ప్రభావం కన్పించవచ్చు
డూమ్స్‌డే గ్లేసియర్‌లో ఉన్న మంచు మొత్తం కరిగితే సముద్రమట్టం దాదాపుగా 3 మీటర్లు అంటే 10 అడుగులు పెరగవచ్చు. ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే కొన్ని దశాబ్దాల్లో అదే జరగవచ్చు.