Earthquake Prone Cities: ఇండియాలో భూకంపం రిస్క్ ఎక్కువ ఉన్న నగరాలు ఏంటో తెలుసా..?

Earthquake Prone Cities In India: టర్కీలో, సిరియాలో సంభవించిన భూకంపాలు ఆ రెండు దేశాలనే కాదు.. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించాయి. టర్కీలో, సిరియాలో.. రెండు దేశాల్లో కలిపి ఊహించని రీతిలో 8 వేలకు పైగా జనం భూకంపానికి బలయ్యారు. కుప్పకూలిన అపార్ట్‌మెంట్ భవనాల కింద సజీవ సమాధి అయ్యారు.

Earthquake Prone Cities In India: టర్కి, సిరియా భూకంపాలు మానవ మనుగడను మరోసారి ప్రశ్నార్థకం చేశాయి. ఆనందంగా సాగిపోతున్న జీవితం తలకిందులు అవ్వడానికి ఒక్క క్షణం చాలని టర్కీ, సిరియా భూకంపాలు మరోసారి నిరూపించాయి.

1 /5

కశ్మీర్ లోయలోని సోయగాలన్నింటినీ తనలోనే నింపుకున్న శ్రీనగర్ కూడా భూకంపం ముప్పు పరంగా జోన్ 5 పరిధిలోకి వస్తుంది. 

2 /5

దేశ వాణిజ్య రాజధాని ముంబై సీస్మిక్ జోన్ 3 కిందకు వస్తుంది. ఈ కారణంగానే భూకంపం రిస్క్ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో ముంబై కూడా ఒకటైంది. పైగా ముంబైకి పొంచి ఉన్న మరో ముప్పు ఏంటంటే.. నగరాన్ని ఆనుకునే సముద్రతీరం కూడా ఉండటంతో ఒకవేళ ముంబైలో భూకంపం సంభవిస్తే.. ఆ తరువాత సునామి కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

3 /5

అస్సాం రాజధాని గువహటి సీస్మిక్ జోన్ 5 కిందకు వస్తుంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా గౌహతిలో భూకంపం అంటూ వస్తే.. దాని దుష్పరిణామాలు అంతే తీవ్రంగా ఉంటాయనేది శాస్త్రవేత్తల అంచనా..

4 /5

దేశంలో అత్యంత ఎక్కువ భూకంపం రిస్క్ ఉన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ అన్నింటికంటే ముందు ఉంటుంది. ఆఫ్గనిస్థాన్‌లోని హిందూ ఖుష్ పర్వతాల నుంచి మొదలుకుని పాకిస్థాన్, నేపాల్ వరకు ఎక్కడ భూకంపం సంభవించినా.. వాటి ప్రకంపనలు ఢిల్లీని తాకుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగానే ఢిల్లీలో తరచుగా భూకంపం సంభవిస్తుండటం వార్తల్లో చూస్తున్నాం.

5 /5

బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా భూకంపం ముప్పు పొంచి ఉంది. చెన్నై కూడా సీస్మిక్ జోన్ 3 పరిధిలోకి వస్తుంది.