COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ? ఇదే విషయమై మేధావులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. " రాబోయే కొద్దిరోజులు భారత్ కి అంత శుభసూచికంగా లేకపోవచ్చు " అని అన్నారు.
Lockdown in India: దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తొలి దశలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ విధించి, గతంలో తరహాలోనే కఠినమైన ఆంక్షలు విధిస్తారనేది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ మెసేజ్ చూసి కొంతమంది జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
China Coronavirus Cases: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పుగా వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Dr Anthony Fauci recommended complete lockdown in India: న్యూ ఢిల్లీ: భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అమెరికాకు చెందిన టాప్ మెడికల్ ఎక్స్పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా ఆంథోని ఫాసీ అన్నారు. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతుండంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన డా ఆంథోని ఫాసీ.
Complete Lockdown In India: కరోనా వైరస్ ప్రభావం గత ఏడాది కన్నా రెండు రెట్లు అధికంగా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో 24 గంటల వ్యవధిలో దాదాపు 4 లక్షల పాజిటివ్ కేసులు దాదాపు 3500 మేర కోవిడ్19 మరణాలు సంభవిస్తుండటంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది.
PM Modi's speech on Coronavirus second wave: ఢిల్లీ : ఎంతో తప్పనిసరైతే కానీ జనం ఇల్లు వీడి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ను (Lockdown) తప్పనిసరి పరిస్థితుల్లో చివరి అస్త్రంగానే ప్రయోగించాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
Lockdown 2021 news updates: ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.
ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అసలు హీరోలు ఎవరు.. రీల్ నటులు ఎవరు అనేది భారత దేశ వ్యాప్తంగా స్పష్టమైంది. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన విలన్, సినీ నటుడు సోనూ సూద్ ఏంటనేది దేశం మొత్తం చూసింది. (All Photos: Twitter)
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ (LockDown In India) విధించనున్నారని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 25నుంచి కేంద్ర ప్రభుత్వం మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతోంది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆగస్టు 2020 నాటికి ఈఎమ్ఐ ( EMI ) పై మారటోరియం ( Moratorium ) ను ప్రకటించింది. అంటే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మరోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సి ( HDFC ) బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది.
Lockdown In Guwahati: గువహటి: కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో అసోం రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని గౌహతీ ( Guwahati Lockdown ) లో జూన్ 29, ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ విధించనున్నట్టు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ ( Covid -19 )నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసాం సర్కార్ స్పష్టంచేసింది.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.
తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నేడు గుర్తించిన పాజిటివ్ కేసులలో 13 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970 కి చేరింది.
చైనా నుండి ఖరీదు చేసిన కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ (coronavirus COVID-19 rapid testing kits from China) పనితీరులో నాణ్యత లోపించిందని.. అటువంటి కిట్స్ కేంద్రం ఎలా కొనుగోలు చేసిందని శివ సేన పార్టీ (Shiv sena slams Modi govt) కేంద్రంపై మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Maharashtr CM Uddhav Thackeray) అధినేతగా ఉన్న శివసేన.. చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
అసలే.. 'కరోనా వైరస్'.. ఆపై లాక్ డౌన్.. ఈ క్రమంలో వలస కూలీలు ఆగమాగమైపోతున్నారు. బతుకుదెరువు కోసం జన్మనిచ్చిన ఊరును వదిలి.. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి వచ్చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా.. బతుకుదెరువు లేక.. బతికే మార్గం తెలియక.. మళ్లీ సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus spread) నివారణకు లాక్ డౌన్ (Lockdown) చేపట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాటిలో ఇండియన్ రైల్వే సేవలు (Indian Railways services) కూడా ఒకటి.
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.